Courtesy: IPL Twitter
పుణే: బ్యాటింగ్‌లో తడబడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల ప్రతిభతో గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు 13 పరుగుల తేడాతో గెలిచింది. ‘హ్యాట్రిక్’ పరాజయాల తర్వాత బెంగళూరు ఖాతాలో ఆరో విజయం చేరింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. మహిపాల్ లొమ్రోర్ (27 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది. కాన్వే (37 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం సాధించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షల్ పటేల్ (3/35) కీలక వికెట్లు తీశాడు.
ధాటిగా మొదలైంది కానీ...
బెంగళూరు ఓపెనర్లు డు ప్లెసిస్, కోహ్లి వరుసగా ఐదు ఓవర్లు చకచకా పరుగులు సాధించడంతో జట్టు స్కోరు 50 దాటింది. ఇంతవరకు బాగానే ఉన్నా... ఆరో ఓవర్ నుంచి బెంగళూరు స్పిన్ ఉచ్చులో పడింది. మొయిన్ అలీ తన తొలి ఓవర్లోనే జోరు మీదున్న డు ప్లెసిస్ (22 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్)కు కళ్లెం వేశాడు. మ్యాక్స్‌వెల్ (3) రనౌటవగా... అలీ అద్భుతమైన బంతితో కోహ్లి (33 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్)ని బౌల్డ్ చేశాడు. దీంతో 5 ఓవర్లలో 51/0గా ఉన్న బెంగళూరు స్కోరు పదో ఓవర్ ముగిసేసరికి 79/3గా మారింది. ఆ తర్వాత లొమ్రోర్... దినేశ్ కార్తీక్ ఆటతీరుతో బెంగళూరు స్కోరు 170 పరుగులు దాటింది.
శుభారంభం లభించినా...
ఓపెనర్లు కాన్వే, రుతురాజ్ (23 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) జోరుతో చెన్నైకి శుభారంభం దక్కింది. అయితే స్వల్ప వ్యవధిలో చెన్నై మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం హర్షల్... జడేజా (3)ను, మొయిన్ అలీ (27 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)ని బోల్తాకొట్టించాడు. ధోని (2) కూడా ఔట్ కావడంతో చెన్నైకి పరాజయం ఖాయమైంది.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) అలీ 30; డు ప్లెసిస్ (సి) జడేజా (బి) అలీ 38; మ్యాక్స్‌వెల్ (రనౌట్) 3; మహిపాల్ (సి) రుతురాజ్ (బి) తీక్షణ 42; పటిదార్ (సి) ముకేశ్ (బి) ప్రిటోరియస్ 21; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 26; హసరంగ (సి) రుతురాజ్ (బి) తీక్షణ 0; షహబాజ్ (బి) తీక్షణ 1; హర్షల్ (రనౌట్) 0; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–62, 2– 76, 3–79, 4–123, 5–155, 6–155, 7–157, 8– 171. బౌలింగ్: ముకేశ్ 3–0–30–0, సిమర్జీత్ 2– 0–21–0, తీక్షణ 4–0–27–3, జడేజా 4–0–20– 0, అలీ 4–0–28–2, ప్రిటోరియస్ 3–0– 42–1.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) సబ్–ప్రభుదేశాయ్ (బి) షహబాజ్ 28; కాన్వే (సి) షహబాజ్ (బి) హసరంగ 56; ఉతప్ప (సి) సబ్–ప్రభుదేశాయ్ (బి) మ్యాక్స్‌వెల్ 1; రాయుడు (బి) మ్యాక్స్‌వెల్ 10; మొయిన్ అలీ (సి) సిరాజ్ (బి) హర్షల్ 34; జడేజా (సి) కోహ్లి (బి) హర్షల్ 3; ధోని (సి) పటిదార్ (బి) హాజల్‌వుడ్ 2; ప్రిటోరియస్ (సి) కోహ్లి (బి) హర్షల్ 13; సిమర్జీత్ (నాటౌట్) 2; తీక్షణ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–54, 2–59, 3–75, 4–109, 5–122, 6–133, 7–135, 8–149. బౌలింగ్: షహబాజ్ 3–0–27–1, హాజల్‌వుడ్ 4–0–19–1, సిరాజ్ 2–0–22–0, హసరంగ 3–0–31–1, మ్యాక్స్‌వెల్ 4–0–22–2, హర్షల్ పటేల్ 4–0–35–3.
ఐపీఎల్‌లో నేడు
సన్‌రైజర్స్ హైదరాబాద్ X ఢిల్లీ క్యాపిటల్స్
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
#RCB win by 13 runs and are now ranked 4 in the #TATAIPL Points Table.
— IndianPremierLeague (@IPL) May 4, 2022
Scorecard - https://t.co/qWmBC0lKHS #RCBvCSK pic.twitter.com/w87wAiICOa
Comments
Please login to add a commentAdd a comment