Breadcrumb
Live Updates
IPL 2022: సీఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ లైవ్ అప్డేట్స్
చెన్నైను చిత్తు చేసిన ముంబై.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 98 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో ముఖేష్ చౌదరి మూడు, సమర్జీత్, మొయిన్ అలీ చెరో వికెట్ సాధించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే ముంబై బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో సామ్స్ మూడు వికెట్లతో సీఎస్కేను దెబ్బతీయగా.. మెరిడిత్ రెండు, బుమ్రా, కార్తీకేయ, రమణ్‌దీప్ సింగ్ తలా వికెట్ సాధించారు. ఇక చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ ధోని 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
12 ఓవర్లకు మంబై స్కోర్: 80/4
12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. ముంబై విజయానికి 48 బంతుల్లో 18 పరుగులు కావాలి.
34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై
98 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 5 ఓవర్ వేసిన ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో సామ్స్, స్టుబ్స్ పెవిలియన్‌కు చేరారు. 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోర్: 36/4
రెండో వికెట్ కోల్పోయిన ముంబై
ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రోహిత్.. సమర్జీత్ సింగ్ బౌలింగ్‌లో ధోనికు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
3 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 21/1
3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(14), సామ్స్ ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్..
98 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆదిలోనే ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన కిషన్.. చౌదరి బౌలింగ్‌లో ఔటయ్యాడు.
చెలరేగిన ముంబై బౌలర్లు.. 97 పరుగులకే కుప్పకూలిన సీఎస్కే
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే ముంబై బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో సామ్స్ మూడు వికెట్లతో సీఎస్కేను దెబ్బతీయగా.. మెరిడిత్ రెండు, బుమ్రా, కార్తీకేయ, రమణ్‌దీప్ సింగ్ తలా వికెట్ సాధించారు. ఇక చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ ధోని 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. 80/8
డ్వైనో బ్రావో(12), సిమిర్జీత్ సింగ్(2).. కుమార్ కార్తీకేయ వేసిన ఒకే ఓవర్లో అవుటయ్యారు.
39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన సీఎస్కే
39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి సీఎస్కే పీకల్లోతు కష్టాల్లో పడింది. ముంబై బౌలర్లలో సామ్స్ మూడు, మెరిడిత్ రెండు, బుమ్రా ఒక్క వికెట్ పడగొట్టారు. క్రీజులో ధోని, బ్రావో ఉన్నారు. 8 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 45/6
ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్కే
29 పరుగుల వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రాయుడు.. మెరిడిత్ బౌలింగ్‌లో కిషన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే
17 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన గైక్వాడ్.. సామ్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన సీఎస్కే
5 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో రాబిన్ ఉతప్ప ఎల్బీగా వెనుదిరిగాడు. 3 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 6 పరుగులు చేసింది. క్రీజులో రుత్‌రాజ్ గైక్వాడ్(2), రాయుడు ఉన్నారు.
తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన సీఎస్కే
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. డానియల్ సామ్స్ బౌలింగ్‌లో ఓపెనర్ డెవాన్ కాన్వే, మోయిన్ అలీ డకౌట్‌గా వెనుదిరిగారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై
ఐపీఎల్-2022లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మొయిన్ అలీ, శివమ్ దూబే, ఎంస్ ధోని (కెప్టెన్), డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, సిమర్జీత్ సింగ్, ముఖేష్ చౌదరి
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, ట్రిస్టన్ స్టబ్స్, రమణదీప్ సింగ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్
Related News By Category
Related News By Tags
-
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా ఆర్సీబీ టైటిల్ విన్నర్
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ మహిళల జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన ల్యూక్ విలియమ్స్‌ను నియమించింది. ఇప్పటివరకు కోచ్‌గా వ్యవ...
-
సీఎస్కే హెడ్‌కోచ్‌గా జహీర్ ఖాన్
చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకున్న స్టీఫెన్ ప్లెమింగ్ స్థానంలో జహీర్ ఖాన్ బాధ్యత...
-
కీలక టోర్నీ నుంచి సీఎస్కే స్టార్ ఔట్..!
చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే మరో కీలక దేశవాళీ టోర్నీకి దూరం కానున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వచ్చే నెలలో జరిగే ఇరానీ కప్‌కు అతడు అందుబాటులో ఉండడని సమాచారం. నివేదికల ప్రక...
-
మరోసారి పేట్రేగిపోయిన ముంబై ఇండియన్స్ బ్యాటర్
షేర్ ఏ పంజాబ్ టీ20 లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ బ్యాటర్, అమృత్సర్ సూర్మాస్ కెప్టెన్ నమన్ ధిర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటికే రెండు విధ్వంసకర శతకాలు సహా, పలు మె...
-
సీఎస్కేలో వాటా కావాలని ధోని అడగలేదు..!
చెన్నై సూపర్ కింగ్స్‌లో వాటా కొనుగోలు చేయాలని ఎంఎస్ ధోని ప్రయత్నించారంటూ వస్తున్న వార్తలను ఆ ఫ్రాంచైజీ ఉన్నతాధికారి ఖండించారు. ధోని ఈ విషయమై తమను ఎప్పుడూ సంప్రదించలేదని, దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయ...


