
Ajit Agarkar Announced DC Assistant Coach: టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. అగార్కర్‌ను జట్టు అసిస్టెంట్ కోచ్‌గా నియమిస్తూ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్, బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్‌తో కలిసి అగర్కార్ కోచింగ్ బాధ్యతలను షేర్ చేసుకుంటాడని డీసీ మేనేజ్‌మెంట్ పేర్కొంది.
ఢిల్లీ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ నిమిత్తం ఇదివరకే ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లను నియమించుకుంది. హెడ్ కోచ్ పాంటింగ్ సిఫార్సు మేరకు ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను, టీమిండియా మాజీ మిడిలార్డర్ ప్లేయర్ ప్రవీణ్ ఆమ్రేను డీసీ కోచింగ్ స్టాఫ్‌లో జాయిన్ చేసుకుంది. తాజాగా అజిత్ అగార్కర్ చేరికతో డీసీ అసిస్టెంట్ కోచ్‌ల సంఖ్య ఐదుకు చేరింది. గతేడాది నుంచి అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్న మహ్మద్ కైఫ్, అజయ్ రాత్రాలు కోచింగ్ టీమ్‌లో కొనసాగుతారని డీసీ స్పష్టం చేసింది.
ఇక అగార్కర్ విషయానికొస్తే.. 44 ఏళ్ల ఈ టీమిండియా మాజీ బౌలర్.. ప్రస్తుతం టీవీ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి పోటీ పడినప్పటికీ.. చేతన్ శర్మను ఆ పదవి వరించింది. 1998 నుంచి 2007 వరకు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అగార్కర్ 28 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 349 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో 42 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: ICC World Cup 2023: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా అజిత్ అగార్కర్!