‘షూటౌట్‌’లో భారత్‌ గెలుపు | India Women Beat Australia In Shootout To Level Hockey Series 1-1 In Perth, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

‘షూటౌట్‌’లో భారత్‌ గెలుపు

May 28 2026 10:50 AM | Updated on May 28 2026 11:10 AM

Indian Women's Hockey Team Wins Second Match

పెర్త్‌: ఆ్రస్టేలియా మహిళల హాకీ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ‘షూటౌట్‌’లో విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. అనంతరం విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్‌’ నిర్వహించగా... భారత్‌ 4–2 గోల్స్‌ తేడాతో గెలుపొందింది.

రెగ్యులర్‌ సమయంలో భారత్‌ తరఫున సుశీలా చాను (46వ నిమిషంలో), ఆ్రస్టేలియా తరఫున ఒలివియా డౌన్స్‌ (10వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. ‘షూటౌట్‌’లో భారత్‌ తరఫున నవ్‌నీత్‌ కౌర్, ఇషిక చౌధరీ, అన్ను, రుతుజా ఒక్కో గోల్‌ చేశారు. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోగా... మూడో మ్యాచ్‌ శుక్రవారం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement