150 రోజులు ఫ్యామిలీకి దూరంగా టీమిండియా!

Indian Cricketers Away From Family For 150 Days - Sakshi

 కరోనావైరస్‌ వల్ల నాలుగు నెలలకు పైగా పని లేకుండా ఖాళీగా ఉన్న భారత క్రికెటర్లు ఇకపై బీజీ కానున్నారు. వారి పునరాగమనం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2020) రూపంలో జరగనుంది. యూఏఈ సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కానుంది. అలాగే టి20 టోర్నమెంట్‌ , ఆస్ట్రేలియా టూర్‌తో పాటు మిగిలిన సంవత్సరానికి గాను క్రికెట్ క్యాలెండర్ సిద్దం చేశారు. కఠినమైన కోవిడ్‌ నిబంధనలు, ప్రోటోకాల్స్‌తో భారత క్రికెటర్లు ఇకపై ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉండాల్సి వస్తోంది. దాదాపు 150 రోజులకు పైగా ఇండియన్‌ క్రికెటర్లు తమ కుటుంబాలకు దూరంగా ఉండనున్నారు. (చదవండి : 'కోచ్ లేని లోటు ధోని తీర్చేవాడు')

ఐపీఎల్‌ ప్రణాళికలో భాగంగా క్రికెటర్లు ఆగష్టు ఆరంభంలోనే అహ్మదాబాద్‌లోని మోటెరా స్టేడియంలో జరిగే జాతీయ శిబిరంలో చేరాలని భావిస్తున్నారు. ఆ తర్వాత వారు తమ ఫ్రాంచైజీలతో ఐపీఎల్‌ క్యాంప్ కోసం యుఎఈకి వెళతారు. దాదాపు నెల రోజుల ముందే అంటే.. ఆగస్టు 20 నాటికి క్రికెటర్లు యూఏఈకి చేరుకోవాల్సి ఉంటుంది. క్వారంటైన్‌లో ఉంచి ఆటగాళ్లను మ్యాచ్‌లకు సిద్ధం చేస్తారు. ఇక కొన్ని ఫ్రాంచైజీలు ఆగష్టు మొదటి, రెండో వారంలోనే దుబాయ్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నాయి. 

ఇక ఐపీఎల్ విషయానికొస్తే, ఇది 51 రోజులకు బదులుగా 53 రోజులు బీసీసీఐ భావిస్తోంది. మెుదట్లో టోర్నమెంట్ వ్యవధి 51 రోజులు నిర్ణయించారు. కానీ దాన్ని రెండు రోజులు పాటు పొడగించి 53 రోజుల పాటు టోర్నీని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 2న ఐపీఎల్ పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తేదీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా నవంబర్ 8న ఫైనల్ మ్యాచ్ అనుకున్నప్పటీకి దాన్ని నవంబర్ 10కి మార్చేందుకు బోర్డు సన్నహాలు చేస్తోంది. నవంబర​ 10న చివరి మ్యాచ్‌ జరిపితే.. అక్కడ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లొచ్చని బీసీసీఐ భావిస్తోంది. అందువల్ల, ఐపిఎల్ సీజన్ 13 ఫైనల్ నవంబర్ 08 కి బదులుగా నవంబర్ 10 న ఆడే అవకాశం ఉంది. (చదవండి : ఏమిటి.. ఎలా.. ఎందుకు?)

ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్న భారత్ జట్టు అక్కడ తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తోంది. డిసెంబర్‌ 3 నుంచి 7 వరకు టెస్ట్‌ సిరీస్‌, జనవరి 17 వరకు వన్డే సిరీస్‌ నిర్వహించాలని  భావిస్తున్నారు. మొత్తంగా దాదాపు 68 రోజులు భారత క్రికెటర్లు ఆస్ట్రేలియాలోనే గడపనున్నారు. ఇటు ఐపీఎల్‌, అటు ఆస్ట్రేలియా టూర్‌తో భారత క్రికెటర్లు దాదాపు 5 నెలలు ఫ్యామిలీలకు దూరంగా ఉండనున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top