జర్మనీకి భారత్‌ షాక్‌ | India shocks Germany | Sakshi
Sakshi News home page

జర్మనీకి భారత్‌ షాక్‌

Oct 25 2024 4:11 AM | Updated on Oct 25 2024 4:11 AM

India shocks Germany

న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్, పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత జర్మనీ జట్టుతో గురువారం జరిగిన చివరిదైన రెండో మ్యాచ్‌లో టీమిండియా 5–3 గోల్స్‌ తేడాతో జర్మనీని ఓడించింది. భారత్‌ తరఫున సుఖ్‌జీత్‌ సింగ్‌ (34వ, 48వ నిమిషాల్లో), కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (42వ, 43వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చొప్పున చేయగా... అభిషేక్‌ (45వ నిమిషంలో) ఒక గోల్‌ సాధించాడు. 

జర్మనీ జట్టుకు ఇలియన్‌ మజ్కోర్‌ (7వ, 57వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ అందించగా... హెన్రిక్‌ మెర్ట్‌జెన్స్‌ (60వ నిమిషంలో) ఒక గోల్‌ చేశాడు. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 0–2తో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో భారత్‌ నెగ్గడంతో సిరీస్‌ 1–1తో సమమైంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ విజేతను నిర్ణయించేందుకు ప్రత్యేకంగా ‘షూటౌట్‌’ నిర్వహించారు. ‘షూటౌట్‌’లో జర్మనీ 3–1తో భారత్‌పై గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement