ఐసీసీ వార్షిక టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విడుదల | India Below 2 Teams, Pakistan's Position Rises As ICC Releases Updated Annual Rankings | Sakshi
Sakshi News home page

ఐసీసీ వార్షిక టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విడుదల

May 1 2026 5:29 PM | Updated on May 1 2026 5:29 PM

India Below 2 Teams, Pakistan's Position Rises As ICC Releases Updated Annual Rankings

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ఇవాళ (మే 1) వార్షిక టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా టాప్‌ ప్లేస్‌ను నిలబెట్టుకోగా.. భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. పాక్‌ జట్టు ఓ స్థానం మెరుగుపర్చుకొని, ఆరో స్థానానికి ఎగబాకింది.

సౌతాఫ్రికా రెండో స్థానంలో.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ నాలుగు, ఐదు స్థానాల్లో నిలువగా.. శ్రీలంక, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు వరుసగా 7 నుంచి 12 స్థానాల్లో ఉన్నాయి.

అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్‌ జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పాట్ కమిన్స్ సారథ్యంలో ఆసీస్ గతేడాది అద్భుత ప్రదర్శన చేసింది. 12 టెస్టుల్లో 10 విజయాలు సాధించి నంబర్‌వన్‌గా నిలిచింది.

సౌతాఫ్రికా జట్టు రెండో స్థానాన్ని దక్కించుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజయంతో ప్రోటీస్ తమ స్థాయిని మరింత పెంచుకుంది.

భారత్ మూడో స్థానం
గతేడాది నుంచి భారత్ 10 టెస్టులు ఆడి నాలుగు మాత్రమే గెలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఒకటి డ్రా చేసుకుంది. అయినప్పటికీ, 104 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని కాపాడుకుంది. ఇంగ్లండ్ 102 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

పాకిస్తాన్‌కు లబ్ది
షాన్‌ మసూద్‌ నేతృత్వంలోని పాకిస్తాన్, ఇటీవల పెద్దగా రాణించకపోయినా పాత ఫలితాల వెయిటేజ్ తగ్గడంతో శ్రీలంకను అధిగమించింది. దీంతో ఆ జట్టు ఐదో స్థానానికి ఎగబాకింది.

ఐసీసీ మహిళల వన్డే వార్షిక ర్యాంకింగ్స్‌ను కూడా ఇదే సందర్భంగా విడుదల చేసింది. ఈ విభాగంలోనూ ఆస్ట్రేలియా టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. ఇంగ్లండ్‌, భారత్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, జింబాబ్వే, పపువా న్యూగినియా, యూఏఈ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement