IND vs AUS: మా ఓటమికి ప్రధాన కారణమిదే.. అస్సలు ఊహించలేదు! వారిద్దరూ అద్భుతం

IND vs AS: Rohit Sharma miffed with Indias batting effort In 2nd ODi - Sakshi

విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్‌ జోరుకు ఆసీస్‌ బ్రేక్‌లు వేసింది. ఆదివారం సాగరతీరం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాను 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు చిత్తు చేసింది.

118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ వికెట్‌ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే ఛేదించింది.  దీంతో మూడు వన్డేల సిరీస్‌ 1-1 సమమైంది. సిరీస్‌ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డే చెన్నై వేదికగా మార్చి22న జరగనుంది. ఇక​ఈ ఘోర ఓటమిపై మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్‌ వైఫల్యమే అని రోహిత్‌ అంగీకరించాడు.

"ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. స్కోర్‌ బోర్డుపై తగినంత పరుగులు ఉంచలేకపోయాం. ఇటువంటి మంచి వికెట్‌పై కేవలం 117 పరుగులు మాత్రమే చేస్తామని అస్సలు ఊహించలేదు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడం మా జట్టును దెబ్బతీసింది. తొలి ఓవర్‌లో శుభ్‌మన్‌ వికెట్‌ను కోల్పోయినప్పుడు.. నేను విరాట్‌ ఇన్నింగ్స్‌ను కాస్త సెట్‌ చేశాము.

మేమిద్దరం త్వరగా 30 నుంచి 35 పరుగులు రాబట్టాము. అయితే తర్వాత వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయాం. అది మమ్మల్ని మరింత వెనుక్కి నెట్టింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి మేము తిరిగి కోలుకోలేకపోయాం. ఈ రోజు మాకు పూర్తిగా కలిసి రాలేదు.

స్టార్క్ అద్భుతమైన బౌలర్‌. అతడు కొత్త బంతితో అద్భుతాలు సృష్టిస్తాడు.  స్టార్క్‌ కొత్త బంతిని స్వింగ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఇక మార్ష్‌ ఒక మంచి పవర్‌ హిట్టర్‌ అని మనకు తెలుసు. అతడు సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు ప్రపంచం‍లోనే పవర్‌ హిట్టర్లలో టాప్‌ 3 లేదా నాలుగో స్థానంలో మార్ష్‌ ఉంటాడు అని" రోహిత్‌ పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: టీమిండియాపై ఆసీస్‌ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top