IND A vs ENG A: భారత జట్టు ప్రకటన | IND A vs ENG A: BCCI Announce Squad Harleen, Anushka Sharma To Lead | Sakshi
Sakshi News home page

IND A vs ENG A: భారత జట్టు ప్రకటన

May 4 2026 9:03 AM | Updated on May 4 2026 9:23 AM

IND A vs ENG A: BCCI Announce Squad Harleen, Anushka Sharma To Lead

షబ్నమ్‌ షకీల్‌

ముంబై: ఇంగ్లండ్‌ మహిళల ‘ఎ’ జట్టుతో ఈ ఏడాది జూన్‌–జూలైలలో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లలో పాల్గొనే భారత మహిళల ‘ఎ’ జట్లను ప్రకటించారు. భారత వన్డే, టీ20 ‘ఎ’ జట్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మీడియం పేస్‌ బౌలర్‌ షబ్నమ్‌ షకీల్‌కు చోటు లభించింది. భారత వన్డే ‘ఎ’ జట్టుకు హర్లీన్‌ డియోల్‌... భారత టీ20 ‘ఎ’ జట్టుకు అనుష్క శర్మ నాయకత్వం వహిస్తారు.

ఇంగ్లండ్‌ ‘ఎ’ జట్టుతో నార్తంప్టన్‌లో జూన్‌ 20న, 23న తొలి రెండు టీ20లు... చెమ్స్‌ఫోర్డ్‌లో జూన్‌25న మూడో టీ20 జరుగుతుంది. అనంతరం జూన్‌ 28న హోవ్‌లో తొలి వన్డేను... జూలై 1న, జూలై 4న టౌన్‌టన్‌లో మిగతా రెండు వన్డేలను నిర్వహిస్తారు.  

భారత ‘ఎ’ టీ20 జట్టు: 
అనుష్క శర్మ (కెప్టెన్‌), వృందా, కమలిని, ఉమా ఛెత్రి, వైష్ణవి శర్మ, ప్రేమ రావత్, పూర్వజ వర్లేకర్, జింతిమణి కలిత, సైమా ఠాకూర్, సిమ్రన్, శ్వేత సెహ్రావత్, దియా యాదవ్, మిన్ను మణి, షబ్నమ్‌ షకీల్, తనూజ కన్వర్‌.  

భారత ‘ఎ’ వన్డే జట్టు: 
హర్లీన్‌ డియోల్‌ (కెప్టెన్‌), ప్రతిక రావల్, ప్రియా పూనియా, తనీషా సింగ్, కమలిని, ఉమా ఛెత్రి, తేజల్‌ హసబి్నస్, నికీ ప్రసాద్, ప్రేమ రావత్, తనూజ కన్వర్, వైష్ణవి శర్మ, షబ్నమ్‌ షకీల్, సయాలీ సత్‌ఘరే, జింతిమణి కలిత, సైమా ఠాకూర్‌.

చదవండి: నా వల్లే ఓటమి.. భారీ మూల్యమే చెల్లించాం: కమిన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement