
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ నిన్న (జులై 15) విడుదలైంది. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 25-28 మధ్య తేదీల్లో జరుగనున్నాయి. వరల్డ్‌కప్ మెయిన్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 20 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు జరుగనున్నాయి.
ప్రపంచకప్‌కు అర్హత సాధించిన 8 జట్లు వార్మప్ మ్యాచ్‌ల్లో పాల్గొంటాయి. ఆస్ట్రేలియా మినహా ప్రతి జట్టు రెండ్రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. వార్మప్ మ్యాచ్‌ల కోసం నాలుగు వేదికలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వార్మప్ మ్యాచ్‌ల్లో భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్లు కూడా పాల్గొంటాయి. శ్రీలంక-ఏ జట్టు రెండు, భారత-ఏ జట్టు ఓ మ్యాచ్ ఆడనుంది.
వార్మప్ మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 25న భారత్, ఇంగ్లండ్ మధ్య బెంగళూరు వేదికగా జరుగనుంది. వరల్డ్‌కప్ సన్నాహకంగా మొత్తం 9 వార్మప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో భారత్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. భారత్ రెండో వార్మప్ మ్యాచ్ కూడా బెంగళూరులోనే సెప్టెంబర్ 27న న్యూజిలాండ్‌తో జరుగనుంది. అన్ని వార్మప్ మ్యాచ్‌లు డే అండ్ నైట్ ఫార్మాట్‌లో జరుగుతాయి.
వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్..
25 సెప్టెంబర్: ఇండియా v ఇంగ్లాండ్, BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 1 గ్రౌండ్, బెంగళూరు, 3 PM
25 సెప్టెంబర్: దక్షిణాఫ్రికా v న్యూజిలాండ్, M. చిన్నస్వామి, బెంగళూరు, 3 PM
25 సెప్టెంబర్: శ్రీలంక v పాకిస్థాన్, కొలంబో క్రికెట్ క్లబ్, కొలంబో, 3 PM
25 సెప్టెంబర్: బంగ్లాదేశ్ v శ్రీలంక ‘ఎ’, ఆర్.ప్రేమదాస, కొలంబో, 3 PM
27 సెప్టెంబర్: ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్, BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 1 గ్రౌండ్, బెంగళూరు, 3 PM
27 సెప్టెంబర్: భారత్ v న్యూజిలాండ్, ఎం. చిన్నస్వామి, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు
27 సెప్టెంబర్: శ్రీలంక v బంగ్లాదేశ్, కొలంబో క్రికెట్ క్లబ్, కొలంబో, 3 PM
28 సెప్టెంబర్: దక్షిణాఫ్రికా v ఇండియా ‘ఎ’, BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 1 గ్రౌండ్, బెంగళూరు, 3 PM
28 సెప్టెంబర్: పాకిస్తాన్ v శ్రీలంక ‘ఎ’, కొలంబో క్రికెట్ క్లబ్, కొలంబో, 3 PM