ఐపీఎల్‌-2026కు ఆంధ్ర కుర్రాడు దూరం | GT announce Kulwant Khejroliya as the replacement for injured Prithvi Raj | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌-2026కు ఆంధ్ర కుర్రాడు దూరం

Mar 26 2026 9:23 AM | Updated on Mar 26 2026 10:02 AM

GT announce Kulwant Khejroliya as the replacement for injured Prithvi Raj

ఐపీఎల్-2026 సీజ‌న్‌కు ముందు గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో కీల‌క మార్పు చోటు చేసుకుంది. గాయం కార‌ణంగా ఈ ఏడాది సీజ‌న్‌కు ఆ జట్టు పేసర్ యర్రా పృథ్వీరాజ్ దూరమయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పృథ్వీరాజ్‌ను గతేడాది జరిగిన వేలంలో రూ. 30 లక్షల బేస్‌ప్రైస్‌కు గుజరాత్ సొంతం చేసుకుంది. కానీ ప్రాక్టీస్ సెషన్‌లో అతడు గాయపడినట్లు తెలుస్తోంది.

ఈ కారణంతోనే పృథ్వీ ఐపీఎల్‌-19వ సీజన్ నుంచి వైదొలిగాడు. దీంతో అతడి స్దానాన్ని ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ కుల్వంత్ ఖేజ్రోలియాతో గుజరాత్ టైటాన్స్ భర్తీ చేసింది. ఖేజ్రోలియాకు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. ఖేజ్రోలియా గతంలో గుజరాత్ టైటాన్స్, కేకేఆర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 

ఇప్పుడు మరోసారి అతడికి ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగమయ్యే అవకాశం దక్కింది. మొత్తంగా 6 ఐపీఎల్ వికెట్లు అతడి పేరిట ఉన్నాయి. మరోవైపు కేకేఆర్ గాయపడిన హర్షిత్ రాణా స్ధానంలో ఢిల్లీ పేసర్ నవ్‌దీప్‌సైనీతో ఒప్పందం కుదర్చుకుంది. సైనీ ఇప్పటికే కేకేఆర్ ట్రైనింగ్ శిబిరంలో చేరాడు. సైనీ గతంలో రాజస్తాన్ రాయల్స్‌, ఢిల్లీ వంటి ఫ్రాంచైజీల తరపున ఆడాడు.

ఐపీఎల్‌-2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు
అజింక్య రహానే (కెప్టెన్),  రఘువంశీ, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కెమెరాన్ గ్రీన్, ఫిన్ సింగ్, టి ప్రవిష్ణ, తీజాక్ అలెన్, తీజాక్ పవీయానా, తీషా సోలంకి, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్, బ్లెస్సింగ్ ముజారబానీ.

ఐపీఎల్‌-2026 కోసం గుజరాత్ టైటాన్స్ జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, జోస్ బట్లర్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, అర్షద్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ సింగ్ బి, గుర్నౌర్ ఖాన్, మన్షి సునర్ శర్మ కిషోర్, జయంత్ యాదవ్, అశోక్ శర్మ, జాసన్ హోల్డర్, టామ్ బాంటన్, కుల్వంత్ ఖేజ్రోలియా, ల్యూక్ వుడ్
చదవండి: IPL 2026: ఆర్సీబీ టీమ్ పేరు మార్పు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement