
లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. పురుషుల 55 కేజీల విభాగంలో భారత బాక్సర్ పవన్ బర్త్‌వాల్ తొలి రౌండ్‌లో గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మైకేల్ డగ్లస్ సిల్వా (బ్రెజిల్)తో జరిగిన బౌట్‌లో పవన్ 3:2తో విజయం సాధించాడు.
భారత ఇతర బాక్సర్లు హితేశ్ గులియా (70 కేజీలు), అభినాశ్ (65 కేజీలు), లవ్లీనా (75 కేజీలు), మీనాక్షి హుడా (48 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), నుపుర్ (ప్లస్ 80 కేజీలు), జాదూమణి (60 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), లక్ష్య చహర్ (80 కేజీలు), జుగ్నూ (85 కేజీలు) తొలి రౌండ్‌లో ‘బై’ పొందగా... నిఖత్ జరీన్ (51 కేజీలు) తొలి రౌండ్‌లో అమెరికా బాక్సర్ జెన్నిఫర్ లొజానాతో ఆడుతుంది.