సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభవార్త. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ త్వరలోనే జట్టుతో చేరనున్నట్లు సమాచారం. కాగా వెన్నునొప్పి కారణంగా ఈ పేస్ బౌలర్ చాలాకాలంగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో జట్టును ముందుకు నడిపించాల్సిన కమిన్స్ (Pat Cummins).. ఫిట్‌నెస్ సమస్యల వల్ల ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత పూర్తిగా ఆటకు దూరమైపోయాడు. టీ20 ప్రపంచకప్-2026లో అతడు లేకుండానే బరిలోకి దిగిన ఆసీస్.. గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టి అవమానం పాలైంది.
కమిన్స్ లేని లోటు సుస్పష్టం
మరోవైపు.. సన్‌రైజర్స్ జట్టులో సైతం కమిన్స్ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్, ప్రధాన పేసర్‌గా అతడు సేవలు అందిస్తాడన్న సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్-2026లో కమిన్స్ గైర్హాజరీలో ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ కేవలం రెండు మాత్రమే గెలిచింది.

గెలుపు బాట
తొలుత కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలిచిన ఇషాన్ కిషన్ బృందం.. తాజాగా రాజస్తాన్ రాయల్స్‌పై సోమవారం జయభేరి మోగించింది. సొంతమైదానం ఉప్పల్‌లో రాయల్స్‌ను 57 పరుగుల తేడాతో చిత్తు చేసి గెలుపు బాట పట్టింది. ఇలాంటి తరుణంలో కమిన్స్‌కు సంబంధించిన అప్‌డేట్ అందడం ఎస్‌ఆర్‌హెచ్ శిబిరంలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
ఆరోజే హైదరాబాద్‌కు
క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. కమిన్స్ బుధవారం (ఏప్రిల్ 15) ఆస్ట్రేలియాలో ఫిట్‌నెస్ టెస్టుకు హాజరుకానున్నాడు. పరీక్షలో పాసైతే గనుక ఏప్రిల్ 17 నాటికి అతడు హైదరాబాద్‌కు చేరుకుంటాడు.
ఈ విషయం గురించి జట్టు సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘అతడు ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసి త్వరలోనే క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి నిరభ్యంతర పత్రం (NOC) పొందుతాడని ఆశిస్తున్నాం’’ అని తెలిపాయి. కాగా కమిన్స్ స్థానంలో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్‌ను ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: SRH: షూ కోసం తల్లి నగలు అమ్మి.. ఎవరీ సాకిబ్ హుస్సేన్?
BCCI: సూర్యకుమార్ యాదవ్‌పై వేటు!


