Girona Open: అనిరుధ్‌–విజయ్‌ జోడీకి నిరాశ  | Girona Open: Anirudh Chandrasekar, Vijay Sundar Prashanth Pair Quits In 1st Round | Sakshi
Sakshi News home page

Girona Open: అనిరుధ్‌–విజయ్‌ జోడీకి నిరాశ 

Mar 29 2024 9:00 AM | Updated on Mar 29 2024 10:43 AM

Girona Open: Anirudh Chandrasekar, Vijay Sundar Prashanth Pair Quits In First Round - Sakshi

కోస్టా బ్రావా (స్పెయిన్‌): జిరోనా ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టెన్నిస్‌ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌ తన భాగస్వామి విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌తో కలిసి తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. మూడో సీడ్‌ సాండెర్‌ అరెండ్స్‌–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జోడీతో జరిగిన మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో అనిరుద్‌–విజయ్‌ ద్వయం 4–6, 4–6తో ఓటమి పాలైంది. 

80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్‌ జంట మూడు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేసింది. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌)–ఆండ్రీ బెగెమాన్‌ (జర్మనీ) ద్వయం 4–6, 3–6తో ఫ్రాన్సిస్కో కబ్రాల్‌ (పోర్చుగల్‌)–హెన్రీ పాటెన్‌ (బ్రిటన్‌) జోడీ చేతిలో పరాజయం పాలైంది. తొలి రౌండ్‌లో ఓడిన అనిరుద్‌–విజయ్‌; బాలాజీ–బెగెమాన్‌ జోడీలకు 800 యూరోలు (రూ. 72 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement