డేవిడ్ మిల్లర్ (PC: BCCI)
టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మిల్లర్ తప్పేమీ లేదంటూ అతడికి మద్దతుగా నిలిచాడు. ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం మంచిదే అయినా ఒక్కోసారి ఎదురుదెబ్బలు తప్పవని.. మిల్లర్ విషయంలోనూ ఇదే జరిగిందన్నాడు.
ఐపీఎల్-2026లో భాగంగా ఢిల్లీ- గుజరాత్ బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడ్డా.. డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 41*) విజయంపై ఆశలు పెంచాడు.
ఒక్క పరుగు తేడాతో
ఈ ఐదో నంబర్ బ్యాటర్ ధనాధన్ దంచికొడుతూ ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకువచ్చాడు. అయితే, చివరి ఓవర్లో గుజరాత్ బౌలర్ ప్రసిద్ కృష్ణ రంగంలోకి దిగగా.. విప్రాజ్ నిగమ్ తొలి బంతికి సిక్స్ బాది మరుసటి బంతికి అవుటయ్యాడు. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ సింగిల్ తీసి స్ట్రైక్ మిల్లర్‌కు ఇవ్వగా.. నాలుగో బంతికి అతడు సిక్సర్ బాదాడు.
చివరి రెండు బంతుల్లో విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. మిల్లర్ సింగిల్‌కు నిరాకరించాడు. ఆఖరి బంతికి తానే హిట్టింగ్ ఆడాలని భావించగా.. ప్రసిద్ షార్ట్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో సింగిల్ తీసేందుకు మిల్లర్ ప్రయత్నించగా.. కుల్దీప్ స్ట్రైకర్ వైపునకు వచ్చే క్రమంలో రనౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
అతడి తప్పేమీ లేదు
ఈ నేపథ్యంలో మిల్లర్‌పై విమర్శలు వస్తుండగా.. భారత దిగ్గజ కెప్టెన్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాత్రం మద్దతుగా నిలిచాడు. "నిజానికి మిల్లర్ విన్నింగ్ రన్స్ తానే తీయాలని భావించాడు. అయితే, ఆఖరి ఓవర్లో కుల్దీప్ తాను ఎదుర్కొన్న తొలి బంతి ద్వారా సింగిల్ తీసిన తీరును మిల్లర్ గుర్తుంచుకోవాల్సింది.
కుల్దీప్‌నకు స్ట్రైక్ ఇచ్చి ఉంటే బాగుండేది. అయితే, గత ఓవర్లో తాను సిక్సర్ బాదిన విషయాన్ని మనసులో పెట్టుకుని.. ఈసారి కూడా అదే పునరావృతం చేయగలనని మిల్లర్ విశ్వసించాడు. ఇందులో అతడి తప్పేమీ లేదు. కానీ ప్రసిద్ కృష్ణ అద్భుత బంతి సంధించి మిల్లర్ ఆశలపై నీళ్లు చల్లాడు’’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే!
Watch it yourself to believe it 🤯
A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅
Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd— IndianPremierLeague (@IPL) April 8, 2026


