టోర్నీ ముగిసినా స్వదేశానికి రాలేదు.. ఆరా తీస్తే | Four Members Afghanistan Under-19 Team Refused Fly Own Country Left UK | Sakshi
Sakshi News home page

Under-19 Worldcup: టోర్నీ ముగిసినా స్వదేశానికి రాలేదు.. ఆరా తీస్తే

Published Tue, Feb 8 2022 3:41 PM | Last Updated on Tue, Feb 8 2022 7:32 PM

Four Members Afghanistan Under-19 Team Refused Fly Own Country Left UK - Sakshi

అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీ ముగిసిన తర్వాత అ‍ఫ్గనిస్తాన్‌ జట్టులోని నలుగురు స్వదేశానికి వెళ్లడానికి నిరాకరించారు. ఆ దేశంలో నెలకొన్న అనిశ్చితి కారణంగానే ఆ నలుగురు లండన్‌లోనే ఆశ్రయం పొందుతున్నారని తెలిసింది. అందులో ఒకరు క్రికెటర్‌ కాగా.. మిగతా ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఈ విషయాన్ని అఫ్గన్‌ క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించినట్లు సమాచారం. అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడడానికి వెళ్లిన మా జట్టులో ఒక ఆటగాడు సహా ముగ్గురు సిబ్బంది స్వదేశానికి తిరిగిరాలేదు. వెస్టిండీస్‌ నుంచి నేరుగా బ్రిటన్‌ వెళ్లిన ఆ నలుగురు అక్కడే ఆశ్రయం పొందుతున్నారని తెలిసింది.

చదవండి: కోహ్లి ఆ త‌ప్పు చేసి ఉండ‌కూడ‌దు.. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి

టోర్నీ ముగిసిన తర్వాత అఫ్గన్‌ క్రికెటర్లు అంటిగ్వా నుంచి కాబుల్‌ వయా యూఏఈ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. అయితే ఆ నలుగురు మాత్రం ఆస్ట్రేలియాతో ప్లేఆఫ్స్‌ ముగిశాక యూఏఈ వరకు కలిసి ప్రయాణించినప్పటికి.. అక్కడి నుంచి లండన్‌ ఫ్లైట్‌ ఎక్కినట్లు తెలుస్తోంది. అయితే ఇలా జరగడం ఇది తొలిసారి మాత్రం కాదు. గతంలోనూ 2009 అండర్‌ -19 ప్రపంచకప్‌లో క్వాలిఫయర్స్‌ ముగిసిన తర్వాత టొరంటో, కెనడాకు చెందిన క్రికెటర్లు తమ దేశంలో భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయని వేరే దేశంలో తలదాచుకున్నారు.

కాగా ఈ విషయంపై అఫ్గనిస్తాన్‌ అండర్‌-19 హెడ్‌కోచ్‌ రయీస్‌ అహ్మద్‌జై స్పందించాడు. ఈ ఆరోపణలను కొట్టివేస్తూ.. విషయం తెలియగానే ఆ నలుగురికి..'' మీ అవసరం అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌కు ఉంది అని'' మెసేజ్‌ పెట్టాను. మెసేజ్‌ చూసినప్పటికి వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నాడు. కాగా అఫ్గనిస్తాన్‌ జట్టు అండర్‌-19 ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన కనబరిచింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం పాలైనప్పటికి అఫ్గనిస్తాన్‌ ఆకట్టుకుంది. ఇక మూడో స్థానం కోసం ఆస్ట్రేలియాతో  జరిగిన పోరులో ఆఖరి వరకు పోరాడినప్పటికి ఓటమి పాలైన అఫ్గన్‌ టోర్నీని నాలుగో స్థానంతో ముగించింది.
చదవండి: IPL 2022 Auction:షేక్‌ రషీద్‌ సహా ఏడుగురు అండర్‌-19 ఆటగాళ్లకు బిగ్‌షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement