న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌ | England Women Beat New Zealand Women By 7 Wickets In First T20, Check Out Score Details And Highlights | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌

May 21 2026 11:02 AM | Updated on May 21 2026 12:28 PM

England women beat New zealand women by 7 wickets in first t20

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఘనంగా బోణీ కొట్టింది. డెర్బీ వేదికగా నిన్న (మే 20) జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. సోఫీ డివైన్‌ (45) ఓ మోస్తరు స్కోర్‌తో రాణించింది. 

మిగతా ప్లేయర్లలో ఇజ్జీ షార్ప్‌ 26 (నాటౌట్‌), మ్యాడీ గ్రీన్‌ 23, ఇసబెల్లా గేజ్‌ 12, బ్రూక్‌ హ్యాలిడే 14, కెప్టెన్‌ అమేలియా కెర్‌ 8, జెస్‌ కెర్‌ 5, జార్జియా ప్లిమ్మర్‌ డకౌటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో లారెన్‌ బెల్‌, ఛార్లోట్‌ డీన్‌ తలో 2 వికెట్లు తీయగా.. లిన్సే స్మిత్‌, డేనియెలా గిబ్సన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 17.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అలైస్‌ క్యాప్సీ (74 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను గెలిపించింది. ఆమెకుయ ఫ్రేయా కెంప్‌ (31 నాటౌట్‌) సహకరించింది. మిగతా ప్లేయర్లలో హీథర్‌ నైట్ 19, సోఫీ డంక్లీ 8, మియా బౌచర్‌ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో బ్రీ ఇల్లింగ్‌ 2, జెస్‌ కెర్‌ ఓ వికెట​్‌ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో రెండో టీ20 మే 23న జరుగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement