ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత! | England Legendary Test Captain MJK Smith Passes Away At Age-92 | Sakshi
Sakshi News home page

MJK Smith: ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత!

May 18 2026 7:36 PM | Updated on May 18 2026 8:23 PM

England Legendary Test Captain MJK Smith Passes Away At Age-92

మైక్‌ స్మిత్‌, ఇన్‌సెట్‌లో అవార్డు అందుకుంటున్న యంగ్‌ స్మిత్‌

ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ టెస్టు కెప్టెన్‌ మైక్ స్మిత్ (92) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మైక్ స్మిత్ (ఎంజేకే స్మిత్‌) ఇంట్లోనే తుదిశ్వాస విడిచినట్లు వార్విక్‌షైర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్ మేటి బ్యాటర్‌గా గుర్తింపు పొందిన మైక్‌స్మిత్ 50 టెస్టులు ఆడాడు. ఇందులో 25 టెస్టులకు ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 

1958లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మైక్ స్మిత్ 1972లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.  50 మ్యాచ్‌ల్లో 2,278 ప‌రుగులు చేసిన మైక్ స్మిత్ మూడు సెంచరీలు సాధించాడు. ఇక ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 637 మ్యాచ్‌లాడి 40వేలకు పైగా పరుగులు సాధించిన మైక్ స్మిత్ 72 సెంచరీలు బాదాడు. 

అంతేకాదు 1991 నుంచి 2003 మ‌ధ్య వార్విక్‌షైర్ కౌంటీ బోర్డు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న ప‌ద‌విలో ఉన్న స‌మ‌యంలోనే వార్విక్‌షైర్ కౌంటీల్లో చాలా టైటిల్స్ సాధించింది. మైక్ స్మిత్ కుమారుడు నీల్ స్మిత్ అప్పటి జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాడు. క్రికెట‌ర్‌గానే గాక ర‌గ్బీ ప్లేయ‌ర్‌గానూ మైక్ స్మిత్ గుర్తింపు పొందాడు. 

1956లో వేల్స్‌తో జ‌రిగిన ర‌గ్బీ మ్యాచ్‌లో ఇంగ్లండ్ త‌ర‌ఫున క్యాప్ అందుకున్నాడు. ఇక మైక్ స్మిత్ మ‌ర‌ణంపై వార్విక్‌షైర్ నివాళి అర్పించింది. కౌంటీ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా గ్లామోర్గాన్‌తో మ్యాచ్‌కు ముందు వార్విక్‌షైర్ మైక్ స్మిత్ మృతి ప‌ట్ల రెండు నిమిషాలు మౌనం పాటించింది.

చదవండి: బంగ్లా బ్యాట‌ర్ చ‌రిత్ర‌.. పాక్‌కు క్లీన్‌స్వీప్‌ గండం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement