జట్టులో అతడు తప్ప వికెట్లు తీసే బౌలర్లు లేరు: సునీల్ గావస్కర్ | Sakshi
Sakshi News home page

IND vs SA: జట్టులో అతడు తప్ప వికెట్లు తీసే బౌలర్లు లేరు: సునీల్ గావస్కర్

Published Mon, Jun 13 2022 6:09 PM

Dont Have Wicke Taking Bowler In Teamindia: Sunil gavaskar - Sakshi

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో 211 పరుగుల భారీ స్కోర్‌ను డిఫెండ్‌ చేయలేక చతకిలపడ్డ భారత బౌలర్లు.. కటక్‌ వేదికగా జరిగిన రెండో టీ20లోను చేతులుత్తేశారు. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటిస్‌ను పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టి భువనేశ్వర్ కుమార్ దెబ్బకొట్టాడు. అయితే మిగితా బౌలర్లు తీవ్రంగా విఫలమయ్యారు.

యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా, అక్షర్‌ పటేల్ భారీగా పరుగులు సమర్పించకున్నారు. కాగా మ్యాచ్‌ అనంతరం టీమిండియా ఓటమిపై భారత దిగ్గజ ఆటగాడు  సునీల్ గావస్కర్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తీవ్రంగా నిరాశపరిచారని గావస్కర్ తెలిపాడు.  “ఈ జట్టులో భువనేశ్వర్ కుమార్ తప్ప వికెట్లు తీసే బౌలర్లు లేకపోవడమే ప్రధాన సమస్య.

సరైన సమయంలో వికెట్లు పడగొడితేనే.. ప్రత్యర్థి జట్టును ఒత్తిడికి గురిచేయవచ్చు. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ భువనేశ్వర్‌ కుమార్‌ మినహా ఎవరైనా వికెట్లు సాధించేలా కనిపించలేదు. అతడు బంతిని అద్భుతంగా స్వింగ్‌ చేస్తున్నాడు. తొలి టీ20లో 211 పరుగులను డిఫెండ్ చేయలేకపోవడానికి కారణం కూడా బౌలర్లు విఫలం కావడమే అని గావస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2022: 'టీ20 ప్రపంచకప్‌ భారత జట్టులో అతడు ఖచ్చితంగా ఉండాలి'

 
Advertisement
 
Advertisement