
సమర్‌కండ్ (ఉజ్బెకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ విజయంతో ఖాతా తెరిచాడు. ఎటెని బాక్రోట్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి గేమ్‌లో నల్ల పావులతో ఆడిన గుకేశ్ 45 ఎత్తుల్లో గెలిచాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు విదిత్, అభిమన్యు పురాణిక్ కూడా తొలి గేముల్లో నెగ్గగా... ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్, రౌనక్ సాధ్వాని, లియోన్, ప్రణవ్, నారాయణన్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు.
పెంటేల హరికృష్ణ, మురళీ కార్తికేయన్, ఆర్యన్ చోప్రా, ఓపెన్ విభాగంలో పోటీపడుతున్న మహిళా గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్‌లకు తొలి గేమ్‌లో ఓటమి ఎదురైంది. మహిళల విభాగం తొలి రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి 56 ఎత్తుల్లో గుల్‌రుఖ్ బేగం (ఉజ్బెకిస్తాన్)పై, వంతిక అగర్వాల్ 65 ఎత్తుల్లో యూలియా (ఉక్రెయిన్)పై నెగగ్గా... మార్సెల్ ఎఫ్రోమ్‌స్కీ (ఇజ్రాయెల్)తో జరిగిన గేమ్‌ను ద్రోణవల్లి హారిక 55 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.