IPL 2023: అదే మా కొంపముం‍చింది.. అందుకే అక్షర్‌ను ముందు పంపలేదు: వార్నర్‌

David Warner Explains Why He Held Back Axar Patel Against SRH - Sakshi

ఐపీఎల్‌-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో ఓటమి చవి చూసింది. అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆదిలోనే కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ వికెట్‌ కోల్పోయింది. అయినప్పటికీ మిచెల్‌ మార్ష్‌, ఫిలిప్‌ సాల్ట్‌లు ఢిల్లీ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. 

ఒక దశలో వికెట్‌ వికెట్‌ నష్టానికి 112 పరుగులతో పటిష్టంగా  కనిపించిన ఢిల్లీ ఈజీగా మ్యాచ్‌ గెలిచేస్తుందని అంతా భావించారు. కానీ వరుస క్రమంలో వీరిద్దరూ ఔట్‌ కావడంతో ఫలితం తారుమారైంది. అయితే ఫిల్‌ సాల్ట్‌ ఔటైన తర్వాత అక్షర్‌ పటేల్‌కు బ్యాటింగ్‌ పంపించి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదాని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్‌ 29 పరుగులు చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇ‍క ఇదే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మ్యాచ్‌ అనంతరం స్పందించాడు.

అందుకే అక్షర్‌ను పంపలేదు..
"మేము బౌలింగ్‌లో దారుణంగా విఫలమయ్యాం. మిచిల్‌ మార్ష్‌ మాత్రం ఇక్కడి పరిస్థితులకు తగట్టు అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతడు మాకు కీలక ఆటగాడు. కానీ విజయానికి కేవలం 9 పరుగుల దూరంలో ఆగిపోవడం మమ్మల్ని చాలా నిరాశపరిచింది. పిచ్ మ్యాచ్‌ మొత్తం ఒకేలా ఉంది. మంచు ప్రభావం కూడా పెద్దగా లేదు. మాకు మంచి ఆరంభం లభించింది. కానీ మధ్యలో మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం.

అదే మా కొంపముం‍చింది.  మిడిల్‌ ఓవర్‌లలో ఎస్‌ఆర్‌హెచ్‌ స్పిన్నర్లు కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఇక అక్షర్‌ పటేల్‌ మంచి టచ్‌లో ఉన్నాడని మాకు తెలుసు. అతడు స్నిన్నర్లను మంచిగా ఎదుర్కొంటాడు,. కానీ మా జట్టులో నాతో కలిపి ఇద్దరే లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. ఈ క్రమంలో అక్షర్ బ్యాటింగ్ చాలా కీలకం అని భావించాం.

అందుకే అక్షర్‌ను కాదని గార్గ్‌, సర్ఫరాజ్‌ను పంపించాం. అక్షర్‌ ఆఖరిలో మ్యాచ్‌ను పూర్తి చేస్తాడని ఆశించాం. కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు.  అయితే అక్షర్‌ను కొచెం ముందుగా బ్యాటింగ్‌కు పంపి ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేదేమో" అని డేవిడ్‌ వార్నర్‌ పేర్కొన్నాడు.
చదవండి: Mitchell Marsh: సిక్సర్ల వర్షం.. ఆట కట్టించిన అకీల్‌! కొం‍చెం కూడా తెలివి లేదు! అనవసరంగా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top