Commonwealth Games 2022:India Badminton Team Enter Into Semi-Finals - Sakshi
Sakshi News home page

CWG 2022: సెమీస్‌లో భారత బ్యాడ్మింటన్‌ జట్టు

Aug 1 2022 9:07 AM | Updated on Aug 1 2022 10:22 AM

CWG 2022: Indian Badminton Team Reaches Semifinal Of Mixed Event - Sakshi

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా 3–0తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. తొలి మ్యాచ్‌లో సుమీత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం... రెండో మ్యాచ్‌లో లక్ష్య సేన్‌... మూడో మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్‌ తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. స్క్వాష్‌లో మహిళల సింగిల్స్‌లో జోష్నా చినప్ప, పురుషుల సింగిల్స్‌లో సౌరవ్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరారు. 

Advertisement
 
Advertisement
Advertisement