'ప్రపంచంలోనే చెత్త క్రికెటర్‌ అంట'.. ఇలాంటి బౌలింగ్‌ చూసుండరు!

Bowler Runs Parallelly With-in Crease Before Delivering Ball Viral - Sakshi

క్రికెట్‌లో ఫన్నీ ఘటనలు చాలానే ఉంటాయి. ఆటగాళ్ల తమ చర్యలతో ఒక్కోసారి విపరీతమైన నవ్వు తెప్పిస్తుంటారు. ఇక బౌలర్లయితే తమ బౌలింగ్‌ యాక్షన్‌తో దృష్టిని మొత్తం తమవైపు తిప్పుకుంటారు. మలింగ, బుమ్రా, పాల్‌ ఆడమ్స్‌ ఇలాంటి కోవకే చెందినవారే. తాజాగా విలెజ్‌ క్రికెట్‌ లీగ్‌లో స్పిన్‌ బౌలర్‌ అయిన జార్జ్ మెక్‌మెనెమీ యూనిక్‌ బౌలింగ్‌ యాక్షన్‌తో అదరగొట్టాడు. బహుశా క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి బౌలింగ్‌ ఇంతకముందు ఎప్పుడు చూసి ఉండరు.

మాములుగా  స్పిన్నర్‌ లేదా ఫాస్ట్‌ బౌలర్‌ ఎంతో కొంత లైనఫ్‌ తీసుకొని బౌలింగ్‌ చేయడం సహజం. ఇప్పుడు మనం చెప్పుకునే బౌలర్‌ మాత్రం కాస్త వినూత్న పద్దతిని అనుసరించాడు. క్రీజుకు ముందు నిలబడి పరిగెత్తుకు వచ్చినట్లుగా రెండు చేతులను తిప్పాడు. ఆ తర్వాత కాసేపు ఆగి చేతిలోని బంతిని పెట్టుకొని ముందుకు, వెనక్కి జరిగాడు. అనంతరం బంతిని విసిరాడు. అప్పటికే బౌలింగ్‌తో కన్ఫ్యూజ్‌ అయిన బ్యాటర్‌ డిఫెన్స్‌ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోను అతనే స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. 

అయితే తన బౌలింగ్‌పై జార్జ్‌ మెక్‌మెనెమీ స్వయంగా స్పందిస్తూ.. ''చూడడానికి మీకు సిల్లీగా అనిపించొచ్చు. ప్రపంచంలోనే అత్యంత చెత్త క్రికెటర్‌ను అయ్యుండొచ్చు. కానీ ఈ క్రికెట్‌ నా జీవితాన్ని కాపాడింది. మానసిక సమస్యల నుంచి బయటపడేలా చేసిన క్రికెట్‌కు కృతజ్ఞతలు. నా ప్రదర్శన పట్ల మా అమ్మ గర్వంగా ఫీలవుతుంది. లవ్‌ యూ క్రికెట్‌'' అంటూ ట్వీట్‌ చేశాడు.

చదవండి: Carlos Braithwaite: 'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్‌ తిక్క కుదిర్చిన అంపైర్‌

Michael Rippon: అరుదైన ఆటగాళ్ల జాబితాలోకి నెదర్లాండ్స్‌ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top