ఇదేమీ బౌలింగ్‌ యాక‌్షన్‌ రా బాబు!

Pavel Florin Bizarre Bowling Action In European Cricket League - Sakshi

అప్పుడప్పుడు రవిచంద్రన్‌ అశ్విన్‌ వెరైటీ బౌలింగ్‌ వేసి అలరించడం మనకు తెలిసిందే. తాజాగా ఓ రొమేనియన్‌ బౌలర్‌ కూడా తన బౌలింగ్‌ యాక‌్షన్‌తో ఇంటర్నెట్‌లో కితకితలు పంచుతున్నాడు. యూరోపియన్‌ యూనియన్‌ టీ10 క్రికెట్‌ లీగ్‌లో రొమేనియా బౌలర్‌ పావెల్‌ ఫ్లోరిన్‌ తన బౌలింగ్‌తో సోషల్‌ మీడియా సెన్సేషనల్‌గా మారిపోయాడు. అతడేమీ చండప్రచండంగా బంతులు విసిరి.. బ్యాట్స్‌మెన్‌ను బెదరగొట్టి వికెట్లు తీయలేదు. పరిగెత్తుకొని వచ్చి.. చాలా నెమ్మదిగా మొత్తం గాలిలోకి బంతిని విసిరేస్తున్నాడు ఈ బౌలర్‌. అసలు బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా.. విచిత్రమైన బౌలింగ్‌ శైలితో వికెట్లకు దూరంగా ఫుల్‌టాస్‌ బంతిని విసురుతున్నాడు. అతని బౌలింగ్‌ వీడియోలు చూసిన నెటిజన్లు.. ఇదేమీ బౌలింగ్‌ యాక‌్షన్‌రా బాబు అని కామెంట్‌ చేస్తున్నారు. ఈ ఏడాది ఇదే బెస్ట్‌ క్రికెట్‌ మూమెంట్‌ అయి ఉంటుందని, ఇతని బౌలింగ్‌ యాక్షన్‌ చూస్తే.. కితకితలు ఖాయమని నెటిజన్లుఅంటున్నారు. మీరు ఓసారి లుక్కేయండి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top