భువనేశ్వర్‌ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే తొలిసారి | Bhuvneshwar Scripts IPL History Reached 200 Wickets Milestone Vs CSK | Sakshi
Sakshi News home page

IPL 2026: భువనేశ్వర్‌ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

Apr 6 2026 7:31 AM | Updated on Apr 6 2026 8:39 AM

Bhuvneshwar Scripts IPL History Reached 200 Wickets Milestone Vs CSK

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆట‌గాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ బౌలింగ్‌లోనూ ప‌దును పెంచుకుంటున్న భువ‌నేశ్వ‌ర్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.

ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఫాస్ట్ బౌల‌ర్‌గానూ భువ‌నేశ్వ‌ర్ చ‌రిత్ర పుట‌ల్లో నిలిచాడు. ఆదివారం సీఎస్‌కేతో మ్యాచ్ సంద‌ర్భంగా ఆయుశ్ మాత్రే వికెట్ తీసిన భువీ 200 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. అయితే టీమిండియా త‌ర‌ఫున ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన‌ రెండో బౌల‌ర్‌గా నిలిచిన భువ‌నేశ్వ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్ల జాబితాలో మాత్రం అగ్ర‌స్థానంలో ఉన్నాడు. 

ఓవ‌రాల్‌గా ఐపీఎల్‌లో 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్న తొలి ఆట‌గాడిగా  స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ నిలిచాడు. చాహ‌ల్ ఇప్ప‌టివ‌ర‌కు 176 మ్యాచ్‌ల్లో 224 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తాజాగా భువ‌నేశ్వ‌ర్ 192 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. భువ‌నేశ్వ‌ర్ త‌ర్వాత కేకేఆర్ స్పిన్న‌ర్ సునీల్ న‌రైన్ 191 మ్యాచ్‌ల్లో 193 వికెట్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు. 

అంతేకాదు ఈ స్వింగ్ కింగ్ మ‌రో అరుదైన రికార్డును కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఫాస్ట్ బౌల‌ర్ల‌కు సాధ్యం కాని 200 వికెట్ల మార్క్‌ను అధిగ‌మించిన తొలి బౌల‌ర్‌గా భువీ నిలిచాడు. టీమిండియా స్పీడ‌స్ట‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా, శ్రీలంక దిగ్గజం ల‌సిత్ మ‌లింగ‌లు కూడా భువ‌నేశ్వ‌ర్ కంటే వెనుక‌బ‌డి ఉన్నారు. ఇక మ్యాచ్‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ 4 ఓవ‌ర్లు వేసి 41 ప‌రుగులిచ్చి 3 కీల‌క వికెట్లు తీశాడు.

విరాట్ ఖాతాలో మ‌రో రికార్డు..
రికార్డులు పెట్ట‌డానికే కోహ్లీ పుట్టిన‌ట్లున్నాడు. తాజ‌గా సీఎస్‌కేతో మ్యాచ్ ద్వారా కోహ్లీ మ‌రో టీమిండియా సీనియ‌ర్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ రికార్డును బ‌ద్ద‌లుకొట్టాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో 28 ప‌రుగులు చేయ‌డం ద్వారా కోహ్లీ ఆ జ‌ట్టుపై 1,174 ప‌రుగులు సాధించాడు. 

త‌ద్వారా ఒకే జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు సాధించిన క్రికెట‌ర్‌గా కోహ్లీ నిలిచాడు. ఇంత‌క‌ముంఉద ఈ రికార్డు రోహిత్ పేరిట ఉంది. రోహిత్ శ‌ర్మ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌పై 1,161 ప‌రుగులు సాధించాడు. తాజాగా కోహ్లీ రోహిత్‌ను దాటి తొలి స్థానంలో నిలిచాడు.

చదవండి: ద్రవిడ్, కుంబ్లేలకు అరుదైన గౌరవం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement