Bhuvneshwar Kumar Reaction Fans Request Leaves Suryakumar Confused - Sakshi
Sakshi News home page

Suryakumar-Bhuvi: భువీ చర్యకు షాక్‌ తిన్న సూర్యకుమార్‌..

Sep 10 2022 6:12 PM | Updated on Sep 10 2022 6:57 PM

Bhuvneshwar Kumar Reaction Fans Request Leaves Suryakumar Confused - Sakshi

ఆసియా కప్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా సూపర్‌-4లో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌, శ్రీలంకలపై వరుస పరాజయాలు చవిచూసిన టీమిండియా.. అఫ్గానిస్తాన్‌పై భారీ విజయం అందుకొని టోర్నీని ముగించింది. ఆసియాకప్‌లో అఫ్గన్‌తో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 71వ సెంచరీతో అభిమానులను సంతోషపెట్టాడు. ఇలా ఒక హ్యాపీ ఎండింగ్‌తో యూఏఈని వీడిన టీమిండియా స్వదేశానికి చేరుకుంది. కాగా స్వదేశానికి బయలుదేరడానికి ముందు టీమిండియా ఆటగాళ్లు హోటల్‌ రూం నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు బస్సులో వచ్చారు.

కాగా ఆటగాళ్లు బస్‌ ఎక్కే సమయానికి పెద్ద ఎత్తున అభిమానులు గూమిగూడారు. కోహ్లి, రోహిత్‌, అశ్విన్‌, కేఎల్‌ రాహుల్‌ సహా ఇతర క్రికెటర్లు అభిమానులకు నవ్వుతూ అభివాదం చేశారు. ఈ సమయంలో అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌ హీరో భువనేశ్వర్‌.. వెనకాలే సూర్యకుమార్‌ వచ్చాడు. భువీ కనిపించగానే.. అభిమానులు భువీ.. భువీ అంటూ గట్టిగా అరిచారు. కానీ భువనేశ్వర్‌ మాత్రం అభిమానులను ఏమాత్రం పట్టించుకోకుండా బస్‌ ఎక్కేశాడు. వెనకే ఉన్న సూర్యకుమార్‌.. ''నిన్ను పిలుస్తున్నారు.. వాళ్లకి హాయ్‌ చెప్పు'' అని భువీకి చెప్పినా అతని మాటలు వినకుండానే వెళ్లిపోయాడు.

ఈ చర్యతో సూర్యకుమార్‌ షాక్‌కు గురయ్యాడు. భువీ చేసిన పనితో కన్ఫూజన్‌కు గురయ్యి.. అభిమానులకు సారీ చెప్పిన సూర్య బస్‌ ఎక్కేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత పంత్‌ మాత్రం​అభివాదం ఒక్కటే చేయకుండా.. వారి దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్‌, సెల్పీలు దిగి అభిమానులను సంతోషపరిచాడు. ఇక స్వదేశానికి చేరుకున్న టీమిండియా.. టి20 ప్రపం‍చకప్‌కు ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టి20 ఫార్మాట్‌లో హోం సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు టీమిండియా ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లనుంది.

చదవండి: Asia Cup 2022: లంకదే ఆసియాకప్‌.. ముందే నిర్ణయించారా!

ఫైనల్లో నసీం షా ఇబ్బంది పెడతాడనుకుంటున్నారా? లంక ఆల్‌రౌండర్‌ రిప్లై అదిరింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement