రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్‌! వేటు త‌ప్ప‌దా? | BCCI To Seek Explanation From Riyan Parag Over Vaping In Dressing Room, Read Story To Get Details About This Controversy | Sakshi
Sakshi News home page

IPL 2026: రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్‌! వేటు త‌ప్ప‌దా?

Apr 30 2026 9:37 AM | Updated on Apr 30 2026 10:20 AM

BCCI To Seek Explanation From Riyan Parag Over Vaping In Dressing Room

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ ‘వేపింగ్‌’ (ఇ–సిగరెట్‌తో పొగ పీల్చడం) చేస్తూ టీవీ కెమెరాల‌కు చిక్కిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ విషయం క్రికెట్ వ‌ర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే ద్రవరూపంలో ఉండే నికొటిన్‌ను ఉపయోగించే ఇ–సిగరెట్‌లను భారత ప్రభుత్వం 2019లోనే నిషేధించింది.

అయినప్పటికి నిషేధిత ఇ–సిగరెట్ వాడి పరాగ్ వివాదంలో చిక్కుకున్నాడు. అతిక్రమనకు లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష కూడా ఉండవచ్చు. తాజాగా ఈ వ్యహరంపై బీసీసీఐ కూడా సీరియస్ అయింది.

"వేపింగ్ చట్టరీత్యా నేరం. కాబట్టి ఈ విషయంపై మేము రియాన్‌ను నుంచి వివరణ కోరతాము. అతడి సమాధానం ఆధారంగా ఐపీఎల్ కమిటీ తదుపరి చర్యలు తీసుకుంటుందని" బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు. కాగా ఇదే విషయంపై ఐపీఎల్ అధికారి కూడా ఒకరు స్పందించారు.

‘చాలా మంది  ఆటగాళ్లు ఇ–సిగరెట్‌లు వాడతారు. ఎన్నో కెమెరాలు తమ వైపు చూస్తుండగా డ్రెస్సింగ్‌రూమ్‌లో ఇలా ఎవరూ చేయరు. ఇంత బహిరంగంగా పట్టుబడటం పరాగ్‌ నిర్లక్ష్యాన్ని చూపించింది. బీసీసీఐ కచి్చతంగా దీనిపై చర్య తీసుకుంటుంది’ అని సదరు అధికారి వెల్లడించారు.

మరోవైపు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూర్చునే క్రికెటర్ల గోప్యతకు సంబంధించి కూడా దీని ద్వారా ప్రశ్నలు తలెత్తాయి. ‘తాజా వివాదం గురించి కాదు కానీ డ్రెస్సింగ్‌ రూమ్‌ క్రికెటర్ల ప్రైవేట్‌ ప్రదేశం. అక్కడ ఆటగాళ్లు తమకు నచి్చనట్లుగా ఉంటారు. అక్కడి దృశ్యాలు కూడా కెమెరాలు రికార్డు చేయడం సరైంది కాదు. 

ఇది క్రికెటర్ల గోప్యతకు భంగం కలిగిస్తుంది. కెమెరామెన్లు మైదానంలో ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలి’ అని బోర్డులోని మరో అధికారి అభిప్రాయపడ్డారు. ఒకవేళ విచారణలో పరాగ్‌ తప్పు చేసినట్లే తేలితే బీసీసీఐ ఒకట్రెండు మ్యాచ్‌లు నిషేధం విధించే అవకాశముంది.
చదవండి: చాలా బాధగా ఉంది.. వారిని మాత్రం తప్పుబట్టను: హార్దిక్‌

Advertisement
 
Advertisement
Advertisement