Ind vs Ban: పసికూనపై భారత్ ఘోర పరాజయం..గిల్ సెంచరీ వృధా..

Asia Cup 2023 Ind Vs Ban: Toss Playing XI Tilak Varma ODI Debut - Sakshi

Asia Cup, 2023- India Vs Bangladesh Updates:

ఆసియా కప్‌లో భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన సూపర్ ఫొర్ దశలోని చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు భారత్ పై 6 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడిన భారత జట్టు 259 పరుగులకే ఆలౌటై 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

తడబడిన టెయిలెండర్లు.. 
అక్షర్ పటేల్ శార్దూల్ ఠాకూర్ ఎనిమిదో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గెలుపుపై ఆశలు రేకెత్తించారు. అంతలోనే ఒకరి తర్వాత ఒకరు బంగ్లా బౌలర్లకు దాసోహం అంటూ కేవలం 10 పరుగుల వ్యవధిలో మిగిలిన మూడు వికెట్లనూ కోల్పోయారు. 

తొమ్మిదో వికెట్ కూడా కోల్పోయిన భారత్.. 
అక్షర్ పటేల్ 34 బంతుల్లో 42 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత జట్టు
లక్ష్యానికి చేరువైన దశలో శార్ధూల్ ఠాకూర్(11) ముస్తఫిజుర్ రహ్మాన్ బౌలింగ్లో మెహదీ హసన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 

శుభ్మన్ గిల్ ఔట్.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. 
సెంచరీ సాధించి మంచి ఊపు మీదున్న గిల్ భారత జట్టును సురక్షితంగా గమ్యానికి చేరుస్తాడని భావిస్తున్నంతలో మహెడీ  భారత జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. మహెడీ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన గిల్ లాంగాఫ్ వైపుగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి హ్రిదోయ్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గిల్ మొత్తం 133 బంతులను ఎదుర్కొని 90.98 స్ట్రైక్ రేటుతో 121 పరుగులు చేశాడు.

జడేజా క్లీన్‌బౌల్డ్‌.. గిల్‌ సెంచరీ
ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా (7) క్లీన్‌బౌల్డయ్యాడు. మరోవైపు గిల్‌ 117 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 38.3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 174/6గా ఉంది. గిల్‌కు జతగా అక్షర్‌ క్రీజ్‌లో ఉన్నాడు. 

సూర్యకుమార్‌ ఔట్‌.. ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
షకీబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (26) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
94 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. మెహిది హసన్‌ బౌలింగ్‌లో ఇషాన్‌కిషన్‌ (5) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. గిల్‌ (57), సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజ్‌లో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. కేఎల్‌ రాహుల్‌ ఔట్‌
74 పరుగుల వద్ద భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. మెహిది హసన్‌ బౌలింగ్‌లో షమీమ్‌కు క్యాచ్‌ ఇచ్చి కేఎల్‌ రాహుల్‌ (19) ఔటయ్యాడు. 42 పరుగులతో గిల్‌ క్రీజ్‌లో ఉన్నాడు.

టార్గెట్‌ 266.. 13 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 64/2
ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయిన భారత్‌.. ఆతర్వాత ఆచితూచి ఆడుతుంది. గిల్‌ (36), కేఎల్‌ రాహుల్‌ (15) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 13 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 64/2.

టార్గెట్‌ 266.. రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌
266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే రోహిత్‌ శర్మను (0) ఔట్‌ చేసిన తంజిమ్‌.. మూడో ఓవర్లో అరంగేట్రం ఆటగాడు తిలక్‌ వర్మను (5) క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

టార్గెట్‌ 266.. రోహిత్‌ శర్మ డకౌట్‌
266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ రెండో బంతికే రోహిత్‌ శర్మ (0) వికెట్‌ కోల్పోయింది. తంజిమ్‌ బౌలింగ్‌లో అనాముల్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ డకౌటయ్యాడు.

50 ఓవర్లలో బంగ్లాదేశ్‌ స్కోర్‌ 265/8
టాస్‌ ఓడి భారత్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. కెప్టెన్‌ షకీబ్‌ (80), తౌహిద్‌ హ్రిదోయ్‌ (54) అర్ధ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో నసుమ్‌ అహ్మద్‌ (44), మెహిది హసన్‌ (29 నాటౌట్‌) బంగ్లాదేశ్‌ ఓ మోస్తరు స్కోర్‌ చేసేందుకు తోడ్పడ్డారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్‌ హసన్‌ (13), లిటన్‌ దాస్‌ (0), అనాముల్‌ హాక్‌ (4), మెహిది హసన్‌ (13), షమీమ్‌ హొస్సేన్‌ (1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. షమీ 2, ప్రసిద్ధ్‌ కృష్ణ, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
238 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. ప్రసిద్ధ​్‌ కృష్ణ బౌలింగ్‌లో నసుమ్‌ అహ్మద్‌ (44) క్లీన్‌ బౌల్డయ్యాడు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
193 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో తిలక్‌వర్మకు క్యాచ్‌ ఇచ్చి తౌహిద్‌ హ్రిదోయ్‌ (54) ఔటయ్యాడు. నసుమ్‌ అహ్మద్‌ (18), మెహిది హసన్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు.

ఆరో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
161 పరుగుల వద్ద (34.1 ఓవర్‌) బంగ్లాదేశ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. జడేజా.. షమీమ్‌ హొస్సేన్‌ను (1) ఎల్బీడబ్ల్యూ చేశాడు. జడేజాకు ఇది వన్డేల్లో 200వ వికెట్‌. 

ఐదో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌. షకీబ్‌ (80) ఔట్‌
160 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో షకీబ్‌ అల్‌ హసన్‌ (80) క్లీన్‌ బౌల్డయ్యాడు. 33.1 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్‌ 160/5. తౌహిద్‌ హ్రిదోయ్‌ (40), షమీమ్‌ హొస్సేన్‌ క్రీజ్‌లో ఉన్నారు.

26 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్‌ స్కోర్‌ 124/4
26 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్‌ స్కోర్‌ 124/4గా ఉంది. షకీబ్‌ అల్‌ హసన్‌ (60), తౌహిద్‌ హ్రిదోయ్‌ (25) క్రీజ్‌లో ఉన్నారు. 

5.4: మూడో వికెట్‌ కోల్పోయిన బంగ్లా
టీమిండియా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ మరోసారి మెరిశాడు. ఓపెనర్‌ తాంజిద్‌ హసన్‌తో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ అనాముల్‌ హక్‌(4) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

3.1: రెండో వికెట్‌ డౌన్‌
శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో తాంజిద్‌ హసన్‌(13) అవుట్‌. అనాముల్‌ హక్‌, షకీబల్‌ హసన్‌ క్రీజులో ఉన్నారు. మూడో ఓవర్‌ ముగిసే సరికి బంగ్లా స్కోరు: 20/2

2.1: తొలి వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
షమీ బౌలింగ్‌లో బంగ్లా ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ బౌల్డ్‌. డకౌట్‌గా వెనుదిరిగిన లిటన్‌ దాస్‌.

తిలక్‌ వర్మ అరంగేట్రం
ఇప్పటికే ఆసియా కప్‌-2023 ఫైనల్లో అడుగుపెట్టిన టీమిండియా.. బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్‌కు సిద్ధమైంది. శ్రీలంకతో తుది పోరుకు ముందు సన్నాహకంగా సాగనున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

వాళ్లందరికీ విశ్రాంతి
ఇక బంగ్లాతో మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాదీ స్టార్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. కాగా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సహా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చినట్లు రోహిత్‌ వెల్లడించాడు. వీరి స్థానాల్లో తిలక్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, ప్రసిద్‌ కృష్ణ, సూర్యకుమార్‌ యాదవ్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌ తరఫున తంజీమ్‌ హసన్‌ వన్డేల్లో  అరంగేట్రం చేశాడు.

తుది జట్లు ఇవే
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్‌ కృష్ణ.

బంగ్లాదేశ్‌
లిటన్ దాస్(వికెట్ కీపర్), తాంజిద్ హసన్, అనముల్ హక్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, షమీమ్ హుస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, మెహది హసన్, నసూమ్ అహ్మద్, తన్జిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.

చదవండి: Ind vs SL: టీమిండియాతో ఫైనల్‌కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top