దుమ్ములేపిన సచిన్‌ కొడుకు.. బ్యాటర్లను భయపెట్టేశాడగా!? | Arjun Tendulkar shines in Ranji Trophy vs Karnataka | Sakshi
Sakshi News home page

దుమ్ములేపిన సచిన్‌ కొడుకు.. బ్యాటర్లను భయపెట్టేశాడగా!?

Oct 26 2025 11:27 AM | Updated on Oct 26 2025 1:56 PM

Arjun Tendulkar shines in Ranji Trophy vs Karnataka

రంజీ ట్రోఫీ 205-26 సీజన్‌లో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు, గోవా స్టార్‌ ఆల్‌రౌండర్‌ అర్జున్‌ టెండూల్కర్‌ అద్బుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. చంఢీగర్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో దాదాపు 100 పరుగులు సమర్పించుకున్న అర్జున్‌.. ఇప్పుడు శిమొగా వేదికగా కర్ణాటకతో జరుతున్న మ్యాచ్‌లో మాత్రం సత్తాచాటాడు.

తన అర్జున్‌ తన అద్బుత బౌలింగ్‌తో కర్ణాటక టాపర్డర్‌ను దెబ్బతీశాడు. గోవా తరపున బౌలింగ్ ఎటాక్‌ను ప్రారంభించిన ఈ స్పీడ్‌ స్టార్‌.. కర్ణాటక ఓపెనర్ నికిన్ జోస్‌ను కేవలం మూడు పరుగులకే అవుట్ చేశాడు. ఆ తర్వాత వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ కృష్ణన్ శ్రీజిత్‌ను డకౌట్‌ అర్జున్‌ పెవిలియన్‌కు పంపాడు. 

అంతేకాకుండా క్రీజులో సెటిల్‌ అయిన అభినవ్ మనోహర్‌ను కూడా అర్జున్‌ బోల్తా కొట్టించాడు. తొలి రోజు ఆటలో12.2 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అర్జున్ టెండూల్కర్.. మూడు వికెట్లు పడగొట్టి కేవలం  33 పరుగులే ఇచ్చాడు. అర్జున్‌ సూపర్‌ స్పెల్‌తో పాటు మరో ఫాస్ట్ బౌలర్ వాసుకి కౌశిక్ రెండు కీలక వికెట్లు తీసి గోవా జట్టును టాప్‌లో ఉంచారు. 

తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కాగా జూనియర్‌ టెండూల్కర్ 2021-22 సీజన్ తర్వాత ముంబై నుంచి గోవాకు తన మకాంను మార్చిన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs AUS: గెలుపు జోష్‌లో ఉన్న టీమిండియాకు భారీ షాక్‌..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement