కరీంనగర్ కుర్రాడు ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన పేరాల అమన్‌రావును మంగళవారం అబుదాబీలో జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.30లక్షలకు దక్కించుకుంది. టాప్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్‌మన్ అయిన పేరాల అమన్ రావు ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అండర్–19, అండర్–23లో గొప్ప నైపుణ్యం ప్రదర్శించారు. వేలంలో పాల్గొనేందుకు అమన్‌రావుకు పాస్‌పోర్టు లేకపోవడంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అప్పటికప్పుడు స్పందించి పాస్‌పోర్టు జారీ చేయించారని సునీల్‌రావు తెలిపారు. మొట్టమొదటిసారిగా జిల్లాకు చెందిన కుర్రాడు ఐపీఎల్‌కు ఎంపిక కావడం హర్షణీయమన్నారు.


