మరణించిన భారత క్రికెటర్ల భార్యలకు ఆర్దిక చేయూత | Rs 1 Lakh Grant For Widows Of Deceased Indian Cricketers | Sakshi
Sakshi News home page

మరణించిన భారత క్రికెటర్ల భార్యలకు ఆర్దిక చేయూత

Aug 26 2025 4:53 PM | Updated on Aug 26 2025 6:03 PM

Rs 1 Lakh Grant For Widows Of Deceased Indian Cricketers

భారత క్రికెటర్స్‌ అసోసియేషన్‌ (ICA) కీలక నిర్ణయం తీసుకుంది. మరణించిన భారత క్రికెటర్ల భార్యలకు రూ. లక్ష గ్రాంట్‌ను ప్రకటించింది. ఈ మొత్తాన్ని అర్హులైన వితంతువులకు ఒక్కసారిగా చెల్లిస్తారు. ఈ స్కీమ్‌ తొలి దఫాలో దాదాపు 50 మందికి లబ్ది చేకూరే అవకాశం ఉంది. మాజీ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచే ప్రక్రియలో భాగంగా ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్లు ICA తెలిపింది.

ఈ పథకానికి ప్రస్తుతం ఆమల్లో ఉన్న మిగతా పథకాలతో సంబంధం లేదు. అవి కొనసాగుతుండగానే, ఈ కొత్త పథకం అమల్లోకి వస్తుంది. ICA ఇప్పటికే మరణించిన భారత మాజీ టెస్ట్‌ క్రికెటర్ల భార్యలకు నెలసరి పెన్షన్‌ ఇస్తుంది. కొత్త పథకానికి ICA వార్షిక సంవత్సర రెండో బోర్డు మీటింగ్‌లో ఆమోదం లభించింది.

కాగా, మాజీ క్రికెటర్ల కుటుంబాలకు అండంగా నిలవడమే ధ్యేయంగా ICA ఏర్పాటు చేయబడింది. దీన్ని 2019లో స్థాపించారు. ICAలో 1750కు పైగా భారత మాజీ క్రికెటర్లు సభ్యులుగా ఉన్నారు. ICA ఇప్పటికే 60 దాటి, పెన్షన్‌ లభించని మాజీ క్రికెటర్లకు సీనియర్‌ మెంబర్‌ రికగ్నిషన్‌ ప్రోగ్రామ్‌ కింద రూ. లక్ష ఆర్దిక సాయం చేస్తుంది. 

అలాగే సభ్యుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కూడా ప్రొవైడ్‌ చేస్తుంది. వీటికి అదనంగా ప్రతి సభ్యుడికి ఏడాదికోసారి కంప్లీట్‌ బాడీ చెకప్‌ ప్రోగ్రామ్‌ను కూడా చేపడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement