breaking news
Indian cricketers security
-
మరణించిన భారత క్రికెటర్ల భార్యలకు ఆర్దిక చేయూత
భారత క్రికెటర్స్ అసోసియేషన్ (ICA) కీలక నిర్ణయం తీసుకుంది. మరణించిన భారత క్రికెటర్ల భార్యలకు రూ. లక్ష గ్రాంట్‌ను ప్రకటించింది. ఈ మొత్తాన్ని అర్హులైన వితంతువులకు ఒక్కసారిగా చెల్లిస్తారు. ఈ స్కీమ్ తొలి దఫాలో దాదాపు 50 మందికి లబ్ది చేకూరే అవకాశం ఉంది. మాజీ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచే ప్రక్రియలో భాగంగా ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్లు ICA తెలిపింది.ఈ పథకానికి ప్రస్తుతం ఆమల్లో ఉన్న మిగతా పథకాలతో సంబంధం లేదు. అవి కొనసాగుతుండగానే, ఈ కొత్త పథకం అమల్లోకి వస్తుంది. ICA ఇప్పటికే మరణించిన భారత మాజీ టెస్ట్ క్రికెటర్ల భార్యలకు నెలసరి పెన్షన్ ఇస్తుంది. కొత్త పథకానికి ICA వార్షిక సంవత్సర రెండో బోర్డు మీటింగ్‌లో ఆమోదం లభించింది.కాగా, మాజీ క్రికెటర్ల కుటుంబాలకు అండంగా నిలవడమే ధ్యేయంగా ICA ఏర్పాటు చేయబడింది. దీన్ని 2019లో స్థాపించారు. ICAలో 1750కు పైగా భారత మాజీ క్రికెటర్లు సభ్యులుగా ఉన్నారు. ICA ఇప్పటికే 60 దాటి, పెన్షన్ లభించని మాజీ క్రికెటర్లకు సీనియర్ మెంబర్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ కింద రూ. లక్ష ఆర్దిక సాయం చేస్తుంది. అలాగే సభ్యుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వీటికి అదనంగా ప్రతి సభ్యుడికి ఏడాదికోసారి కంప్లీట్ బాడీ చెకప్ ప్రోగ్రామ్‌ను కూడా చేపడుతుంది. -
మా ఆటగాళ్ల పరిస్థితి ఏమిటి?: బీసీసీఐ
ముంబై: ఇంగ్లండ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత క్రికెటర్ల భద్రతపై ఐసీసీతో బీసీసీఐ ఆందోళన వెలిబుచ్చింది. ‘ఉదయం లేవగానే మాంచెస్టర్‌లో ఉగ్రవాదుల దాడి గురించి విన్నాను. వెంటనే భారత క్రికెటర్ల ప్రయాణం, వసతి, మ్యాచ్‌లపై ఐసీసీ తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్ల గురించి మా ఆందోళన తెలియజేసాం. అయితే రెండు గంటల్లోనే ఐసీసీ మాకు సమాధానమిచ్చింది’ అని బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌధరి తెలిపారు. కోహ్లి నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు నేడు (బుధవారం) ఇంగ్లండ్‌కు పయనం కానుంది.