బాటిల్స్‌లో పెట్రోల్ కొట్టడం చట్ట విరుద్ధం. ఇంధనాన్ని బయట నిల్వ చేయడం ప్రమాదకరం కనుక బాటిల్స్ కొట్టడానికి అనుమతించడం లేదు. 1934 తీసుకొచ్చిన పెట్రో సేఫ్టీ చట్టం ప్రకారం బాటిళ్లలో లేదా ఇతర కంటైనర్లలో పెట్రోల్ కొనడం కానీ అమ్మడం కానీ నిషేధం. . ప్రధానంగా అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు, ప్రమాదాలు జరగకుండా నిరోధించడం కొరకు ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్‌లో ఆందోళన ఎక్కువైంది. అది ప్రధానంగా పెట్రోల్, గ్యాస్‌పై ప్రజల్లో ఆందోళన పెరిగిపోయింది. గ్యాస్ దొరకపోతే పరిస్థితి ఏంటి.. పెట్రోల్ దొరకపోతే ఏం చేయాలి? అని డైలమాలో పడ్డారు జనం.
భారత్‌లో పెట్రోల్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ వాహనదారుల్లో మాత్రం ఆందోళన పోవడం లేదు. ప్రధానంగా నగర ప్రాంతాల్లో వాహనదారులు.. ఇంధనం కొరత ఎక్కడ వస్తుందోననే భయంతో పెట్రోల్ బంకులకు క్యూకట్టిన పరిస్థితులు నిన్న, మొన్న ఎక్కువగా కనిపించింది. నగరాల్లో కిలోమీటర్ల మేర క్యూలు కనిపించడంతో ప్రజల్లో మరింత భయం ఎక్కువైంది. ఒకర్ని చూసి ఒకరు ఏమౌతుందోననే గాబరాతో బంక్‌ల వద్దే గంటల తరబడి నిరీక్షించి మరీ పెట్రోల్ కొట్టించుకుని ఊపిరి పీల్చుకున్నారు.
బైక్ ట్యాంక్‌తో పెట్రోల్ బంక్‌కు..!
అయితే ఓ వ్యక్తికి వినూత్న ఆలోచన వచ్చింది. ఎలాగూ బాటిళ్లలో పెట్రోల్ కొట్టడం లేదు.. బండి తీసుకుని వెళ్లి బంక్ దగ్గర నిలబడాలంటే చాలా సమయం పడుతుందనే భావనతో ఓ వ్యక్తి ఏకంగా బైక్‌కు ఉన్న పెట్రోల్ ట్యాంక్‌ను ఊడదీసి బంక్‌కు తీసుకొచ్చాడు. ఎవరేమి అనుకుంటే నాకేంటి అనుకుంటూ దర్జాగా పెట్రోల్ కొట్టించుకున్నాడు.. హుషారుగా వెళ్లిపోయాడు. కానీ అక్కడ క్యూలో ఉన్న వారికి మాత్రం కోపం చిర్రెత్తుకొచ్చింది. బైక్ లేకుండా తీసుకొచ్చిన ట్యాంక్‌కు పెట్రోల్ ఎలా కొడతారంటూ అక్కడున్న వారు చిరాకు పడ్డారు. ఈ ఘటన చూసి అక్కడున్న వారు శభాష్ అని మెచ్చుకున్న వారు లేకపోలేదు.
ప్రస్తుతం ఈ వీడీయో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ పెట్రోల్ కాబట్టి.. ఇది పెట్టిన క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. దీనిపై యూజర్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
‘ఎలాగూ బాటిల్స్‌లో పెట్రోల్ కొట్టడం అనేది నిషేధం.. అదే సమయంలో కేవలం బైక్ ట్యాంకుల్లో కొట్టడానికి మాత్రమే అనుమతి ఉంది. అదే చేశాడు ఆ వ్యక్తి. బైక్ ట్యాంక్‌నే తీసుకొచ్చి పెట్రోల్ కొట్టించుకున్నాడు’ అని ఒక యూజర్ స్సందించగా, ఈ వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలంటూ మరొకరు డిమాండ్ చేశారు.
Petrol in bottles is banned and allowed only in bike tanks, so he just brought the tank without bike. 😂 pic.twitter.com/xVS1om4v9y
— Oppressor (@TyrantOppressor) March 26, 2026
ఎవరు ఏమనుకున్నా


