డబుల్‌బెడ్రూం కాలనీల్లో తప్పని గోస | - | Sakshi
Sakshi News home page

డబుల్‌బెడ్రూం కాలనీల్లో తప్పని గోస

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

దుబ్బాక: మున్సిపాలిటీలో ప్రధానంగా డబుల్‌బెడ్రూం కాలనీల్లో నీటిఎద్దడి నెలకొంది. కాలనీల్లో సుమారు 900 కుటుంబాలు నివసిస్తున్నారు. మిషన్‌ భగీరథ పైపులైన్‌ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతున్నప్పటికీ చాలా కాలనీలకు సరిపడా నీళ్లు రావడం లేదు. జీప్లస్‌ టూ పద్ధతిలో డబుల్‌ బెడ్రూంల నిర్మాణం ఉండటంతో పైన ఉన్నవారికి తిప్పలు అన్నీ ఇన్నీకావు. నీటిగోస తీర్చేందుకు ఇటీవలనే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బోర్లు వేసినప్పటికీ పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. 3 వేలకు పైగా జనాభా ఉన్న డబుల్‌ బెడ్రూం కాలనీల్లో మంచినీటి ఎద్దడి తీర్చాలని ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదంటూ స్థానికులు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement