ప్రైవేటు వాటర్‌ ప్లాంట్లను ఆశ్రయిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వాటర్‌ ప్లాంట్లను ఆశ్రయిస్తూ..

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

సిద్దిపేటజోన్‌: జిల్లా కేంద్రంలోని నూతన కాలనీల్లో తాగునీటి సమస్య నెలకొంది. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నప్పటికీ కొన్ని కాలనీల్లో ‘భగీరథ’ నీటి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కొన్ని కాలనీల్లో భగీరథ పైపులైన్‌ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మిలాన్‌ గార్డెన్స్‌, మహిళా డిగ్రీ కళాశాల, ఎల్లంకి కళాశాల పరిసర ప్రాంతాల్లో భగీరథ నీరు లేకపోవడంతో ప్రజలు ప్రయివేటు వాటర్‌ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. రూ.80కోట్లతో అమృత్‌ పథకం కింద కొత్తగా మిషన్‌ భగీరథ పనులు చేపట్టారు. పైపులైన్‌ పనులు పూర్తి అయినప్పటికీ ఇళ్లకు కనెక్షన్‌ ఇవ్వడంపై జాప్యం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement