ఊరూరా ఇక గ్రంథాలయం | - | Sakshi
Sakshi News home page

ఊరూరా ఇక గ్రంథాలయం

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

ఊరూరా ఇక గ్రంథాలయం నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు యాంటీ డ్రగ్స్‌ అఫిడవిట్‌ తప్పనిసరి

సంస్థ చైర్మన్‌ దరిపల్లి చంద్రం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దరిపల్లి చంద్రం అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీపరీక్షలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. జిల్లా గ్రంథాలయంలో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత ఉద్యోగాలను సాధించాలన్నారు. ఉద్యోగ కల్పన కేంద్రాలుగా గ్రంథాలయాలు ఉపయోగపడుతాయన్నారు. అంతకు ముందు దరిపల్లి చంద్రంను గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.

సర్వం సిద్ధం చేసిన అధికారులు

సిద్దిపేటఎడ్యుకేషన్‌: జిల్లాలో బుధవారం నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ నెల 21వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని శాఖల అధికారుల సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. పరీపక్షల నిర్వహణ కోసం సీఎస్‌, డీఓలు, కస్టోడియన్లు, స్క్వాడ్‌ బృందాలను నియామకం చేసి ఇప్పటికే వారికి అవగాహన సమావేశం నిర్వహించి తగు సూచనలు, సలహాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రవీందర్‌రెడ్డి చెప్పారు. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిబంధనల్లో చేర్చిన ఇంటర్‌బోర్డు

నారాయణఖేడ్‌: ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలో ప్రవేశాలు పొందే విద్యార్థులు తప్పనిసరిగా యాంటీ డ్రగ్‌ అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుందని ఇంటర్మీడియెట్‌ బోర్డు స్పష్టం చేసింది. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కళాశాల విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటి నివారణకు కట్టుదిట్టమైన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యువత, కళాశాల విద్యార్థులు డ్రగ్స్‌ బారిన పడకుండా కాపాడేందుకు పోలీసు, ఎకై ్సజ్‌, విద్యాసంస్థలు కలిసి పని చేస్తున్నాయి. డ్రగ్స్‌ అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఈగల్‌ టీంను సైతం ఏర్పాటు చేశాయి. కళాశాలలు, హోటళ్ల ప్రాంతాల్లోనూ తనిఖీలు జరుపుతున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్‌ ప్రమాదాలపై సెమినా ర్లు, యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement