మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
మల్లన్న ఆలయంలో
స్వామివారి రాజగోపురం
ఎదుట భక్తులసందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. ఆదివారం వేకువజామునే పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొంత మంది భక్తులు గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.


