నిధులివ్వకపోతే మంత్రులను అడ్డుకుంటాం | - | Sakshi
Sakshi News home page

నిధులివ్వకపోతే మంత్రులను అడ్డుకుంటాం

Apr 1 2026 8:18 AM | Updated on Apr 1 2026 8:18 AM

ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్‌: పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులిచ్చి, పనులు పూర్తిచేయడానికి నెలరోజుల్లో చర్యలు చేపట్టకపోతే మంత్రులు వివేక్‌, పొన్నం ప్రభాకర్‌ల పర్యటనలను అడ్డుకుంటామని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో అసంపూర్తిగా ఉన్న ఆర్‌టీసీ బస్టాండ్‌ను పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. కేసీఆర్‌ హయాంలో గజ్వేల్‌కు మంజూరు చేసిన రూ.180కోట్ల నిధులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోపించారు. ఈ నిధులు వెంటనే ఇచ్చి పెండింగ్‌ పనులు పూర్తిచేయడానికి సహకరించాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక గజ్వేల్‌ ప్రాంతానికి ఒరిగిందేమీలేదన్నారు. ప్రజ్ఞాపూర్‌లో బస్టాండ్‌ పనులు అసంపూర్తిగా ఉండటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని వాపోయారు. అదేవిధంగా పట్టణంలో 150మీటర్ల మేర రింగు రోడ్డు పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు గంగిశెట్టి రవీందర్‌, కళ్యన్‌కర్‌ నర్సింగరావు, బీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు ఊడెం కృష్ణారెడ్డి, గోలీ సంతోష్‌, మర్కంటి కనకయ్య, అహ్మద్‌, స్వామిచారి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement