‘స్వచ్ఛ సిద్దిపేట’ సాధనే.. స్వచ్ఛ సిద్దిపేట సాధనే లక్ష్యంగా సమష్టిగా కృషిచేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్‌మంజుల పిలుపునిచ్చారు. వివరాలు 9లో u
● హరీశ్‌రావు వినతికిస్పందించిన మంత్రి ఉత్తమ్ ● ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు
సాక్షి, సిద్దిపేట: యాసంగి పంటలకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలుచేపట్టింది. యాసంగి పంట కాలం పూర్తయ్యేంత వరకు పంట పొలాలకు సాగు నీటిని అందించేందుకు అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్‌లోకి నీటి పంపింగ్ చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కలిసి లేఖ అందజేశారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించి మంగళవారం ఇరిగేషన్ అధికారులను నీటిని పంపింగ్ చేయాలని ఆదేశించారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఐదేళ్లుగా యాసంగి పంటకు రంగనాయక సాగర్ కాల్వల ద్వారా పంట పొలాలకు సాగు నీటిని అందిస్తున్నామని, రంగనాయక సాగర్ కింద ప్రతి ఏడాది గణనీయంగా పంట ఉత్పత్తి పెరుగుతోందని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది సుమారు 50 వేల ఎకరాల్లో పంట సాగులో ఉందని రంగనాయక సాగర్‌లో ఇటీవల 2.4 టీఎంసీల నీటిని పంపింగ్ చేశారన్నారు. ప్రస్తుతం రంగనాయక సాగర్‌లో 1 టీఎంసీ నీళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని యాసంగి పంటకు పూర్తి స్థాయిలో నీరు అందించాలంటే ఇంకా 1.5 టీఎంసీల నీరు అవసరం ఉందని లేఖలో వివరించారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్‌లోకి నీటిని పంపింగ్ చేయాలని తెలిపారు.


