సిద్దిపేటజోన్: క్రీడా పాఠశాలలను సద్వినియోగం చేసకోవాలని జిల్లా క్రీడాశాఖ అధికారి వెంకటనర్సయ్య తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి క్రీడా పాఠశాలల ఎంపిక పోటీల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా చక్కటి గుర్తింపు గౌరవం లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతీయ క్రీడా పాఠశాలలున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలకు బాలబాలికలను ఎంపిక చేసి నైపుణ్యం గల క్రీడాకారులగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రాజ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


