దరఖాస్తు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తు చేసుకోండి

Mar 26 2026 10:26 AM | Updated on Mar 26 2026 10:26 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఎస్సీ కార్యాచరణ ప్రణాళికాలో భాగంగా స్వయం ఉపాఽధి పథకాలు, శిక్షణా కార్యక్రమాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ విజయభార్గవ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్ట్రికల్‌ టూ విలర్‌, త్రీ వీలర్‌, అగ్రిడోన్‌ సేవలు, వ్యవసాయ యాంత్రిక ఉమ్మడి కేంద్రం, సోలార్‌ యూనివర్సల్‌ పంప్‌ కంట్రోల్‌, వ్యవసాయ అనుబంధ విభాగం, పాడిగేదెల పథకం, సెరికల్చర్‌, ఉద్యాన సంబంధిత, చిన్ననీటి పారుదల బోర్‌వెల్‌ విద్యుదీకరణ పంప్‌ సెట్లు, సబ్‌ మెర్సిబుల్‌ పంప్‌ సెట్‌, సర్వీస్‌ కనెక్షన్‌ చార్జీలు, బోర్‌వెల్‌ వేయడానికి అయ్యే ఖర్చులో సబ్సిడీలో అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కల్గిన ఎస్సీ అభ్యర్థులు ఏప్రిల్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే శిక్షార్హులు

సిద్దిపేటఅర్బన్‌: కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయడం నైతికంగా తప్పే కాకుండా చట్టపరంగా శిక్షార్హులవుతారని సిద్దిపేట త్రీటౌన్‌ సీఐ టాటా లక్ష్మీబాబు హెచ్చరించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసిన కుమారులకు బుధవారం పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. త్రీటౌన్‌ పరిధిలోని ఖమ్మంపల్లికి చెందిన పాముకుంట నర్సయ్య, ఎల్లవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ముగ్గురికి సమానంగా ఆస్తులను పంచి ఇచ్చారు. అయినప్పటికి వారిని పోషించకుండా వదిలేయడంతో ఈ నెల 18న ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన సీఐ బుధవారం ముగ్గురు కుమారులను పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. తల్లిదండ్రుల బాధ్యత ప్రతి కుమారుడి ప్రాథమిక బాధ్యత అని హితబోధ చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకో నున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెలిపారు. జిల్లాలోని పలు ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒంటిపూట పాఠశాలలు నిర్వహించకుండా, పూర్తి స్థాయి (ఫుల్‌డే) నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నా రు. జిల్లాలోని అన్ని పాఠశాలలు ఏప్రిల్‌ 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement