గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ బడ్జెట్‌ రూ.40.31కోట్లు | - | Sakshi
Sakshi News home page

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ బడ్జెట్‌ రూ.40.31కోట్లు

Mar 26 2026 10:26 AM | Updated on Mar 26 2026 10:26 AM

● ఏకగ్రీవంగా ఆమోదించిన పాలకవర్గం ● సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ యాదవరెడ్డి

● ఏకగ్రీవంగా ఆమోదించిన పాలకవర్గం ● సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ యాదవరెడ్డి

గజ్వేల్‌: గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీకి సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.40.31 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌ గంగిశెట్టి చందన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ వివరాలను జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ విమల చదివి వినిపించారు. మున్సిపాలిటీకి అంచనా ఆదాయం రూ.40.31 కోట్లుగా, వ్యయం రూ.39.88 కోట్లుగా చూపి.. మిగులు రూ.49.63 కోట్లుగా ఉంటుందని వెల్లడించారు. బడ్జెట్‌ నిధులను ప్రాధాన్యత రంగాలకు ఖర్చుపెడతామని చైర్‌పర్సన్‌ తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటగోపాల్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ కళ్యన్‌కర్‌ పద్మాబాయి, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement