సృజనాత్మకత.. పలు మండలాల్లోని అంగన్‌వాడీల్లో బాళమేళాలు చేపట్టారు. విద్యార్థులకు ఆటలు, పాటలు చేపట్టారు. వివరాలు 9లో u
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి
సిద్దిపేటకమాన్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. అవకాశం ఉన్న కేసులు రాజీ కుదుర్చుకోవాలన్నారు. దీంతో సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. గురువారం నుంచే కక్షిదారులు కోర్టులో కేసులు రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో మొత్తం 2,340 కేసులు రాజీ కుదుర్చుకునేందుకు అవకాశం ఉందన్నారు. అదేవిధంగా జిల్లా కోర్టులో బ్యాంకు అధికారులతో న్యాయమూర్తి సంతోష్‌కుమార్ సమావేశం నిర్వహించారు.


