ఐఐసీటీ సైంటిస్ట్ వసుంధర
సిద్దిపేటఎడ్యుకేషన్: ఆవశ్యకతనే ఆవిష్కరణలకు తల్లి అని, అవసరం ఉన్నప్పుడే మనిషి కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తారని ఐఐసీటీ సైంటిస్టు వసుంధర అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ఎమర్జింగ్ మెటీరియల్ ఫర్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ అప్లికేషన్స్’ అనే అంశపై రెండ్రోజుల జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాస్త్రవేత్తలు సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రకృతిని పరిరక్షిస్తూ పరిశోధనలు చేసి శాసీ్త్రయ అభివృద్ధిని సాధించాలని సూచించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో శాస్త్రవేత్త డాక్టర్ చంద్రబోస్, సదస్సు కన్వీనర్ డాక్టర్ మహేశ్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుసూదన్, వైస్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.


