సిద్దిపేట.. ఇక కాంగ్రెస్ కోట
సిద్దిపేటఅర్బన్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి సిద్దిపేటను కాంగ్రెస్ కంచుకోటగా మారుస్తామని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో ఎన్సాన్‌పల్లి సర్పంచ్‌గా పోటీ చేసిన బాలరాజ్ కృష్ణమూర్తితో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌ను కనుమరుగు చేస్తామన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌పై, హరీశ్‌రావుపై విశ్వాసం కోల్పోయారన్నారు. ఇక నుంచి సిద్దిపేటపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, వాటి ఫలాలను ప్రజలకు అందేలా చూడాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో డీసీసీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, అర్బన్ మండల అధ్యక్షుడు భిక్షపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు కట్కూరి సత్యనారాయణ, ఉప సర్పంచ్ సంతోష్‌రెడ్డి, వార్డు సభ్యులు కనకరాజు, కరుణాకర్, గిరి, సతీష్, కంది ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో
జెండా ఎగురవేస్తాం
ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్
ఎన్సాన్‌పల్లిలో పార్టీలోకి
భారీగా చేరికలు


