పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జిలు
సాక్షి, సిద్దిపేట: ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ (పీఏసీఎస్) ప్రస్తుత పాలకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు పర్సన్ ఇన్‌చార్జీలుగా కొనసాగనున్నారు. పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 14న ముగిసింది. వాటినే పర్సన్ ఇన్‌చార్జి మేనేజింగ్ కమిటీలుగా ఆరు నెలలు పాటు కొనసాగించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ గడువు ముగిసిన తర్వాత ఆగస్టు 14న నిరవధికంగా పొడిగింపు ఇచ్చింది. తాజాగా శుక్రవారం వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో ఉన్న 21 పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జిలను జిల్లా సహకార అధికారి వరలక్ష్మి నియమించారు. కొండపాక పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జిగా డీసీఏవో నాగేశ్వర్ రావు, చేర్యాల, రేబర్తికి అసిస్టెంట్ రిజిస్ట్రార్ సతీశ్ రెడ్డి, ములుగు, వర్గల్‌లకు శ్రీనివాస్ రెడ్డి, హుస్నాబాద్, కట్కూర్‌లకు గౌతమ్, సిద్దిపేట, గంగాపూర్‌కు అమృతసేనారెడ్డి, దుబ్బాక, మిరుదొడ్డిలకు రాజశేఖర వర్మ, గజ్వేల్, జగదేవ్‌పూర్‌లకు రఘోత్తమ్‌రెడ్డి, కోహెడ, బెజ్జంకిలకు రాజమౌళి, పాలమాకుల, నంగునూరులకు సీనియర్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, దౌల్తాబాద్, కానుగల్‌కు రవి, మిట్టపల్లి, అల్లీపూర్‌లకు యాదగిరి నియమితులయ్యారు. శనివారం వీరంతా బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతల స్వీకరణ


