మురుగుతో సతమతం
గుంతలమయంగా రోడ్డు
గజ్వేల్ రూరల్: గజ్వేల్ మండలం బయ్యారం గ్రామ ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రాత్రి సమయంలో పలువురు ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. ఈ మార్గం గుండా వెళ్లాలంటే జంకుతున్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నిలిచిన జీపీ భవన నిర్మాణం
అక్కన్నపేట: అక్కన్నపేట మండలం కన్నారం గ్రామ పంచాయతీ భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. మూడేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించారు. అది ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో శిథిలావస్థలో ఉన్న భవనంలోనే పాలన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
తొగుట: తొగుట మండల కేంద్రంలో పలు కాలనీల్లో మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్నేళ్లుగా మురుగు కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్ల ముందే గుంతలు తవ్వి మురుగు నీటిని పంపిస్తున్నారు. దీంతో దోమలతో సతమతం అవుతున్నారు. ఎన్నికల సమయంలో డ్రైనేజీ కాలువల నిర్మాణం చేస్తామని ఇప్పటివరకు పూర్తి చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మురుగుతో సతమతం
మురుగుతో సతమతం


