పల్లె ప్రగతి మారేనా..!
సాక్షి, సిద్దిపేట: నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లకు పల్లెల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ప్రతి పంచాయతీలో సమస్యలు తిష్టవేశాయి. రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య లోపం, నీటి సరఫరాలో అంతరాయం, పాఠశాలలు, అంగన్‌వాడీలకు ప్రహరీ లేకపోవడం, వీధిలైట్లు... ఇలా అనేక సమస్యలు సవాల్‌గా మారాయి. పన్నుల ద్వారా సమకూరే ఆదాయం కేవలం సిబ్బంది జీత భత్యాలు, ట్రాక్టర్ ఈఎంఐలు, ఇతర పారిశుద్ధ్య నిర్వహణకే సరిపోవడం లేదు. పలుచోట్ల పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు చేశారు. జిల్లాలోని 508 సర్పంచ్‌లు, 4,508 వార్డులకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
నూతన సర్పంచ్‌లకు సమస్యల స్వాగతం
రెండేళ్ల తర్వాత పంచాయతీ పాలకవర్గాలు
జిల్లాలో 508 జీపీలు, 4,508 వార్డులు
రేపు బాధ్యతలు స్వీకరించనున్న సర్పంచ్‌లు


