జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
గజ్వేల్‌రూరల్: జాతీయ స్థాయి నెట్‌బాల్ పోటీల్లో రాణించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని గజ్వేల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి అన్నారు. పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంఎల్‌టీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వాసాల వైష్ణవి ఎంపికయింది. ఈ నెల 25 నుంచి 30 వరకు కర్ణాటకలోని మంగుళూరులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్–19 బాలికల విభాగంలో జాతీయస్థాయి నెట్‌బాల్ పోటీల్లో ఆడానుంది. ఈ సందర్భంగా వైష్ణవితో పాటు కళాశాల పీడీ సమ్మయ్యలను డీఐఈఓ రవీందర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిర్మయిలు అభినందించారు.


