మెలకువలతో మెరవాలి
కలెక్టర్ కె.హైమావతి
మహిళా సంఘాల సభ్యుల
నాసిక్ పర్యటన
పచ్చ జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్
సిద్దిపేటరూరల్: నాసిక్ క్షేత్ర పర్యటనలో భాగంగా మహిళలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మెలకువలను నేర్చుకొని ఆర్థిక పురోగతి సాధించాలని కలెక్టర్ కె.హైమావతి కోరారు. శనివారం కలెక్టరేట్ నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌లో గల సయ్యాద్రి ఫామ్స్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మూడు రోజుల పాటు పర్యటించనున్న మహిళా సంఘాల సభ్యుల బృందం వాహనాన్ని కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో స్వయం సహాయక మహిళా సంఘాలను ప్రోత్సహించడం, టెక్నాలజీ పరిశీలన కోసం జిల్లా సమాఖ్య, మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు మొత్తం 25 మంది పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్థికంగా ఎదగడం కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఎల్డీఎం హరిబాబు, అదనపు డీఆర్డీఓ సుధీర్ బాబు, డీపీఎం వాసుదేవ్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా అధికారులు రోడ్డు భద్రత నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ కె.హైమావతి అన్నారు. శనివారం పోలీస్, రవాణా, ఆర్టీసీ, రోడ్లు భవనాలు, నేషనల్ హైవే, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. జనవరి 1 నుండి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వాహనదారులకు, డ్రైవర్లకు, విద్యార్థులకు సాధారణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమవేశంలో అదనపు డీసీపీ కుశాల్కర్, ఏసీపీలు, జిల్లా వైద్యాధికారి డాక్టర్. ధనరాజ్, సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ భవభూతి, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చే సోమవారం నుంచి యథావిధిగా కార్యక్రమం ఉంటుందన్నారు.


